Terrorist Amir Hamza : చావుబతుకుల్లో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాకు తీవ్ర గాయలయ్యాయి.  లాహోర్‌లోని తన నివాసంలో జరిగిన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లష్కరే తోయిబా 17 మంది వ్యవస్థాపక సభ్యులలో హంజా ఒకరు.

New Update
Amir Hamza

Amir Hamza

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాకు తీవ్ర గాయలయ్యాయి.  లాహోర్‌లోని తన నివాసంలో జరిగిన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లష్కరే తోయిబా 17 మంది వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన హంజా తన ఇంటి లోపల జరిగిన ప్రమాదం కారణంగా గాయపడ్డారు. అయితే సోషల్ మీడయాలో అతనిపై కాల్పులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి కానీ ఈ ఊహాగానాలు అబద్ధమని దర్యాప్తులో తేలింది.

 లష్కరే తోయిబాకి కీలకంగా

అమీర్ హంజా ఆఫ్ఘన్  లష్కరే తోయిబాకి నిధుల సేకరణ, రిక్రూట్ మెంట్ లో కీలకంగా వ్యవహరించాడు.  ఎల్‌ఇటి కేంద్ర సలహా కమిటీ సభ్యుడిగా, హఫీజ్ సయీద్ నాయకత్వంలోని ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2018లో  లష్కరే తోయిబా నుంచి విడిపోయి జైషే మన్ ఖఫా అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. హంజా ఆరోగ్య పరిస్థితి గురించి పాకిస్తాన్ అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.  

lashkar-e-taiba | Amir Hamza | accident | pakistan | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు