USA Elections:
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారస్ ఆరిజోనాలోని డగ్లస్ కు చెందిన యూఎస్–మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కమలా..అమెరికాలోకి అక్రమ వలసలు నివారించేందుకు..సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరి చేస్తానని చెప్పారు. యూఎస్‌లోనే ఉంటూ ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు. దాంతో పాటూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్ళల్లో విచ్ఛిన్నమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి ఎటువంటి చట్టబద్ధమైన మార్గాలను రూపొందించలేదు. ఈవిధంగా రాజకీయాలు చేయడానికి ప్రజలను ఉపయోగించుకునే వారికంటే దేశ భద్రత గురించి శ్రద్ధ వహించే వారికి ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని కమలా హారిస్ అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.
కమలా హారిస్ వ్యాఖ్యల మీద రిపబ్లికన్ పార్టీ అభర్థి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సరిహద్దుల దగ్గరకు వెళ్ళని కమలా సడెన్‌గా ఇప్పుడు అక్రమ వలసల విషయం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. సరిహద్దుల దగ్గరకు వెళ్ళి ప్రసంగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని విమర్శించారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి ఇక్కడ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా ఆమె పట్టించుకోలేదని మండిపడ్డారు. చిన్న పట్టణాలన్నింటినీ హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని ఆరోపించారు.
Also Read: హింస గురించి పాక్ మాట్లాడ్డం ఏంటో..యూఎన్‌లో భారత్ కౌంటర్