హింస గురించి పాక్ మాట్లాడ్డం ఏంటో..యూఎన్‌లో భారత్ కౌంటర్ హింస గురించి పాకిస్తాన్ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని భారత్ వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమేంటో అని యూఎన్‌వోలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్. By Manogna alamuru 28 Sep 2024 | నవీకరించబడింది పై 28 Sep 2024 18:48 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి India At UN: ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా పక్క దేశం పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మీద మరోసారి అక్కసు వెళ్ళగక్కింది. పాక్ ప్రధాని షెహబాజ్ కాశ్మీర్ అంశాన్ని, ఆర్టిల్ 370 మీద వ్యాఖ్యలు చేశారు. వాటిని భారత దౌత్య వేత్త భవిక మంగళానందన్ గట్టిగా తిప్పి కొట్టారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ భారత్ దేశం గురించి మాట్లాడ్డం ఏంటో అని కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తూ అవాస్తవాలను వినాల్సి వచ్చింది అన్నారు భవిక. కొన్నేళ్ళుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా వాడుతున్న పాక్ హింస గురించి మాట్లాడటం వంచనే అవుతుందని భారత దౌత్యవేత్త అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవమేంటంటే.. ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది అని విమర్శించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌లో ఇదంతా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే షరీఫ్ జమ్మూ–కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. తమ దేశం గురించి మాట్లాడ్డం మానేసి దాదాపు 20 నిమిషాలు కేవలం ఆర్టికల్ 370 రద్దు గురించే మాట్లాడారు. పాలస్తీనా ప్రజల్లాగే జమ్మూ–కాశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 పేరుతో భారత్ ఏకపక్షంగా చర్యలను తీసుకుంటోందని విమర్శించారు. పాకిస్తాన్ కు ఇలా అంతర్జాతీయ వేదికలపై ఇలా అక్కసును వెళ్ళగక్కడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగింది. ఆ దేశం.. భారత్ గురించి మాట్లాడడం...తర్వాత భంగ పడడం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని, విడదీయరాని భాగమంటూ భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తోంది. కశ్మీర్ సమస్యను లేవనెత్తడం, భారత్‌పై విషం చిమ్మడం మానుకొని తమ దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని భారత్ చెబుతున్నా పాకిస్థాన్ మాత్రం మారడం లేదు. Also Read: మరో రెండు రోజుల్లో మూడవ విడత పోలింగ్..జేకేలో ప్రధాని మోదీ ప్రచారం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి