ముమ్మరంగా ప్రచారం.. ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకున్న కమలా, ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కమలా హారిస్, ట్రంప్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా అక్ర వలసలపై కమలా చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ వేశారు. By Manogna alamuru 28 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి USA Elections: డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారస్ ఆరిజోనాలోని డగ్లస్ కు చెందిన యూఎస్–మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కమలా..అమెరికాలోకి అక్రమ వలసలు నివారించేందుకు..సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరి చేస్తానని చెప్పారు. యూఎస్‌లోనే ఉంటూ ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు. దాంతో పాటూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్ళల్లో విచ్ఛిన్నమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి ఎటువంటి చట్టబద్ధమైన మార్గాలను రూపొందించలేదు. ఈవిధంగా రాజకీయాలు చేయడానికి ప్రజలను ఉపయోగించుకునే వారికంటే దేశ భద్రత గురించి శ్రద్ధ వహించే వారికి ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని కమలా హారిస్ అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. కమలా హారిస్ వ్యాఖ్యల మీద రిపబ్లికన్ పార్టీ అభర్థి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సరిహద్దుల దగ్గరకు వెళ్ళని కమలా సడెన్‌గా ఇప్పుడు అక్రమ వలసల విషయం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. సరిహద్దుల దగ్గరకు వెళ్ళి ప్రసంగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని విమర్శించారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి ఇక్కడ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా ఆమె పట్టించుకోలేదని మండిపడ్డారు. చిన్న పట్టణాలన్నింటినీ హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని ఆరోపించారు. Also Read: హింస గురించి పాక్ మాట్లాడ్డం ఏంటో..యూఎన్‌లో భారత్ కౌంటర్ #usa #kamala-harris మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి