జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి బిగ్ షాక్.. రూ.126 కోట్ల జరిమానా !

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కర్ పౌడర్‌ను వాడటం వల్లే తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ వ్యవహారంపై తాజాగా విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. జాన్సన్‌ కంపెనీకి ఏకంగా రూ.126 కోట్ల జరిమానా విధించింది.

New Update
Johnson

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌ను వాడుతుంటారు. అయితే గతంలో ఈ పౌడర్‌తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కంపెనీ టాల్కర్ పౌడర్‌ను వాడటం వల్లే తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. జాన్సన్‌ కంపెనీకి ఏకంగా రూ.126 కోట్ల జరిమానా విధించింది. 

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

వైద్య పరీక్షల్లో క్యాన్సర్

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2021లో ఇవాన్ అనే వ్యక్తి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో అతనికి మోసోథెలియోమాన్ అరుదైన క్యాన్సర్ వచ్చినట్లు తేలింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ వాసనను పీల్చినందుకే తనకు ఈ క్యాన్సర్ వచ్చినట్లు అతడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై తాజాగా విచారించిన కనెక్టికట్ సుపీరియర్ కోర్టు బాధితుడికి రూ.126 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది. అలాగే అదనపు ఖర్చులు కూడా చెల్లించాలంటూ స్పష్టం చేసింది.

Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

మేము పోరాడుతాం

అయితే కోర్టు తీర్పుపై జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్‌ స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన నిజాలను వినకుండానే ట్రయర్ జడ్జి తీర్పునిచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము పోరాడుతామన్నారు. అలాగే టాల్కమ్ పౌడర్ సురక్షితమైనదని.. క్యాన్సర్‌కు కారణం కాదంటూ చెప్పుకొచ్చారు. 

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

జాన్సన్ అండ్ జాన్సన్ అమ్మే బేబీ టాల్కమ్ పౌడర్‌లో క్యాన్సర్ కారకలు ఉన్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ పౌడర్‌ ఆస్‌బెస్టాస్ క్యాన్సర్‌కు కారకంగా మారుతోందని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే దాదాపు 62 వేలకు పైగా వివిధ కోర్టుల్లో ఈ కంపెనీపై పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని 9 బిలియన్ డాలర్లతో పరిష్కరించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు వచ్చింది. ఇదిలాఉండగా 2020లో అమెరికా, కెనడా మార్కెట్‌లలో కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈ టాల్కమ్ పౌడర్ విక్రయాలను ఆపేసింది. 

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు