Ashes: మనిషి చనిపోతే సాధారణంగా డెబ్ బాడీని కాల్చి, ఆ బూడిదను ఏదైనా పవిత్ర జలంలో కలిపేస్తాం. కానీ ఆ బూడిద కోట్ల రూపాయలు విలువ చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. అవును మీరు చదువుతున్నది నిజమే. జపాన్ లో చితాభస్మాన్ని అమ్మకానికి పెడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. శ్మశాన వాటికల్లో బూడిదను కలెక్ట్ చేసి స్వయంగా జపాన్ ప్రభుత్వమే బిజినెస్ చేయడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Golf City: హైదరాబాద్‌కు త్వరలో 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ..
బూడిద నుంచి లోహాలు..
ఈ మేరకు జపాన్‌లోని పబ్లిక్ శ్మశాన వాటికల్లో బూడిదను నీళ్లలో కలిపేవారు. కానీ ఇటీవల ఆ బూడిదలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉంటాయని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో చనిపోయిన 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలు సేకరించింది. అనంతరం వాటిని పరిశీలించి అమ్మకానికి పెట్టగా.. రూ.400 కోట్లు సంపాదించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలను మరింత అభివృద్ధి చేయడంతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఆ డబ్బును వినియోగిస్తోంది.
ఇది కూడా చదవండి: Diwaliకి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం
ఇది కూడా చదవండి: IND vs NZ: 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం
ఇది కూడా చదవండి: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?