/rtv/media/media_files/2026/03/04/israel-warns-2026-03-04-15-56-13.jpg)
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, తదుపరి ఆ దేశ పగ్గాలు చేపట్టబోయే నేతపై ఇజ్రాయెల్ బహిరంగంగానే మరణశాసనం రాసింది. మార్చి 4 (బుధవారం) ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్‌గా ఫిబ్రవరి 28న నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్‌గా ఇరాన్ ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఎవరు వచ్చినా వదిలేది లేదు: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
ఈ నివేదికలపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, సోషల్ మీడియాలోనే వార్నింగ్ ఇచ్చాడు. "ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరించడానికి ప్రయత్నించే ఏ నాయకుడైనా అతని అంతమే మా లక్ష్యం. అతని పేరు ఏదైనా, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం" అంటూ హీబ్రూ భాషలో హెచ్చరించారు.
'ఆపరేషన్ రోరింగ్ లయన్'లో భాగంగా ఈ మిషన్‌ను పూర్తి చేయాలని తాను ప్రధాన మంత్రిని, ఇజ్రాయెల్ రక్షణ దళాలను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు ప్రస్తుత పాలనను కూల్చివేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగిపోదని స్పష్టం చేశారు.
כל מנהיג שימונה ע"י משטר הטרור האיראני כדי להמשיך ולהוביל את התוכנית להשמדת ישראל, לאיים על ארה"ב והעולם החופשי ומדינות האזור, ולדכא את העם האירני - יהיה יעד חד משמעי לחיסול.
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) March 4, 2026
לא חשוב מה שמו והמקום בו יסתתר.
רה"מ ואני הנחינו את צה"ל להיערך ולפעול בכל האמצעים למימוש המשימה כחלק…
కొత్త వారసుడిగా మోజ్తాబా ఖమేనీ?
ఇరాన్‌లోని 88 మంది సభ్యుల నిపుణుల అసెంబ్లీ ఇప్పటికే మోజ్తాబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు సమాచారం. అయితే, ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్‌కు అత్యున్నత మతపరమైన హోదా ఉండాలి. మోజ్తాబాకు అటువంటి అర్హత ఉందా లేదా అనే దానిపై ఇరాన్ మత పెద్దలలో ఇంకా చర్చ జరుగుతోంది. మరోవైపు, దివంగత నేత అలీ ఖమేనీకి ఇరాన్ ప్రజలు బుధవారం రాత్రి నుండి వీడ్కోలు పలకనున్నారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ ప్రార్థన మందిరంలో రాత్రి 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఈ వీడ్కోలు కార్యక్రమాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఇరాన్ ఇస్లామిక్ ప్రచార మండలి వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఒకవైపు సుప్రీం లీడర్ అంత్యక్రియల సన్నాహాలు, మరోవైపు ఇజ్రాయెల్ నుండి అందుతున్న బహిరంగ హత్య బెదిరింపులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి.
Follow Us