Israel : గాజాకి వెళ్తున్న 45 నౌకలు హైజాక్.. ఇజ్రాయిల్ మూర్ఖపు చర్య

గాజాలో శరణార్థులకు సహాయ సామగ్రిని తీసుకువెళ్తున్న అంతర్జాతీయ నౌకలను ఇజ్రాయెల్ నావికా దళం మధ్యధరా సముద్రంలో అడ్డగించింది. ఈ నౌకల్లో పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఉన్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్, ఆమెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించింది.

New Update
Israel navy

గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి శరణార్థుల సాయం కోసం తీసుకువెళ్తున్న అంతర్జాతీయ నౌకలను ఇజ్రాయెల్ నావికా దళం మధ్యధరా సముద్రంలో అడ్డగించింది. ఈ నౌకల్లో పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఉన్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్, ఆమెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించింది. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని అందించేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు, కార్యకర్తలు కొన్ని షిపులను పంపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ భద్రతాపరమైన కారణాలు చూపిస్తూ, గాజాకు సముద్ర మార్గంలో వెళ్లేందుకు ఈ నౌకలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఒక ప్రకటనలో, నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డగించినట్లు, ఎలాంటి హింస లేదా ఘర్షణ లేకుండా వాటిని ఇజ్రాయెల్ ఓడరేవు వైపు మళ్లించినట్లు తెలిపింది.

గ్రెటా థన్‌బర్గ్ సురక్షితం

ఆ నౌకల్లో ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కూడా ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. ఆమెతో పాటు ఇతర కార్యకర్తలందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఇజ్రాయెల్ తీరంలోని ఆష్డోడ్ ఓడరేవుకు తరలిస్తున్నారని వెల్లడించారు. అక్కడికి చేరుకున్న తర్వాత, వారిని విచారించి, వారి సొంత దేశాలకు పంపిస్తామని ఐడీఎఫ్ తెలిపింది. మానవతా కోణంలోనే గాజాకు సహాయం చేసేందుకు వచ్చామని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఈ ఫ్లోటిల్లా నిర్వాహకులు పేర్కొన్నారు. గాజాలో ప్రజలు తిండి, వైద్య అందక దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, వారికి తక్షణమే సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని వారు వాదించారు. మరోవైపు, ఇజ్రాయెల్ మాత్రం నౌకల ద్వారా గాజాలోకి ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువులు వెళ్లే అవకాశం ఉందని, అందుకే భద్రతా తనిఖీలు తప్పనిసరి అని వాదిస్తోంది. ఈ నౌకల్లోని సహాయ సామగ్రిని ఇజ్రాయెల్ ఓడరేవులో తనిఖీ చేసిన తర్వాత, భూ మార్గాల ద్వారా గాజాకు పంపుతామని ఐడీఎఫ్ పేర్కొంది. ఈ సంఘటన అంతర్జాతీయ సమాజంలో మళ్లీ చర్చనీయాంశమైంది. 

Advertisment
తాజా కథనాలు