US Israel Strikes: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ టార్గెట్‌...బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీని హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నాయి.

New Update
FotoJet (4)

US Israel Strikes

US And Israel Attack: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీని హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడింది. పెద్ద ఎత్తున దాడులకు తెగబడటంతో రాజధాని నగరంలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భారీ పేళుళ్లతో ఆ ప్రాంతమంతా కంపించడంతో పాటు పెద్దఎత్తున పొగలు అలుముకున్నాయి. పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, అధికారిక టెలివిజన్ కార్యాలయం ఉండటం గమనార్హం. సెంట్రల్ టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధం మొదటి రోజు.. టెహ్రాన్‌ను చేరుకునే మార్గానికి అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించామని,  రెండో రోజు కీలక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఉగ్రవాద పాలన కొనసాగిస్తున్న ఇరాన్‌ రాజధాని గుండెకాయపై (హార్ట్ ఆఫ్ ద సిటీ) తాము దాడులు చేస్తున్నాం. టెహ్రాన్‌కు మార్గం సుగమం చేయడానికి గత రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం భారీ దాడులు చేసింది. తద్వారా గగనతల ఆధిపత్యాన్ని సాధించింది’ అని  వెల్లడించింది.  పేలుడు ధాటికి ఒక భవనం నుంచి భారీగా పొగ ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలు స్థానికంగా కనిపించాయి. ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. - america supports israel

Also Read :  అమెరికా ప్లాన్‌ మాములుగా లేదుగా.. ఖమేనీని ఎలా హతమార్చిందో తెలుసా ?

చమురు ట్యాంకర్‌పై దాడి..నలుగురికి గాయాలు

ఇక హార్ముజ్ జలసంధిలో ఓ చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు ఒమన్‌ వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. పలావు జెండాతో ప్రయాణిస్తున్న స్కైలైట్ అనే చమురు ట్యాంకర్‌ను  లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు చెప్పింది. అందులో భారత్‌, ఇరాన్‌కు చెందిన సిబ్బంది ఉన్నారని పేర్కొంది. అయితే, దీనిపై ఎవరు దాడి చేశారన్నది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఇరాక్‌లోని ఓ మిలిటెంట్‌ గ్రూప్‌.. ఇర్బిల్‌లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ దాడి చేసింది. - america iran news

Also Read :  భారతీయులపై ఇరాన్‌ దాడులు..

ప్రతీకారం తీర్చుకుంటాం...

తమ అగ్రనేత ఖమెనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలోనే గల్ఫ్ ప్రాంతాలపైకి పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లోని ప్రాంతాలను తాకాయి.  మరోవైపు టెలిగ్రామ్ వేదికగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)  తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘మా దేశ సాయుధ దళాల చరిత్రలో మునుపెన్నడూ లేనంత భయంకరమైన ఆపరేషన్ ఏ క్షణంలోనైనా ప్రారంభం కావచ్చు. ఆక్రమిత ప్రాంతాలు, అమెరికా ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం. ఉమ్మహ్ ఇమామ్ (ఖమెనీ) హంతకులను ఇరాన్ జాతి ప్రతీకార హస్తం విడిచిపెట్టదు. వారికి కఠినమైన, నిర్ణయాత్మకమైన శిక్ష తప్పదు’ అని తన పోస్ట్‌లో పేర్కొంది. - america iran war live

Advertisment
తాజా కథనాలు