లెబనాన్‌పై రాకెట్ల వర్షం.. సరిహద్దుల్లో 900 మంది భారత సైనికులు

దక్షిణ లెబనాన్‌పై రాకెట్లు, ఫైటర్ జెట్లతో దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం లెబనాన్‌ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Israel Military

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నేతన్యాహూ కూడా స్పందించారు. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని.. త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మరోవైపు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. లెబనాన్‌ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నారు.    

Also Read: ముస్లిం దేశాలను గెలకడమే ఇజ్రాయెల్ పనా? చరిత్ర ఏం చెబుతోంది?

లెబనాన్‌పై భూతల, వైమానిక దాడులకు దిగాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. దక్షిణ లెబనాన్‌పై రాకెట్లు, ఫైటర్ జెట్లతో దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేసింది. మరోవైపు దాడులను తాము సమర్థవంతంగాఎదుర్కొంటామని హిజ్బొల్లా పేర్కొంది. లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న భారత జవాన్లు ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ వర్గాలు ప్రకటించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు