Israel-Hamas: సంధి దిశగా ఇజ్రాయెల్‌-హమాస్‌ !

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

New Update
iran warns israel

Israel-Hamas War: చాలా కాలంగా జరుగుతున్న ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్‌ పాల్గొంటున్నారని ఇజ్రాయెల్‌ పేర్కొంది. మరో వైపు ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్‌ వర్గాలు సైతం వెల్లడించాయి.

Also Read: కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..మహారాష్ట్రలో పోటీకి సిద్ధం

దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి  సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌ కు చెందిన ఓ సీనియర్‌ అధికారి మీడియా సంస్థకు తెలిపారు. హమాస్‌ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి.

Also Read: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్

స్థానభ్రంశం చెందిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయానికి అడ్డంకులు తొలగాలి అని పేర్కొన్నారు. మరో పక్క బందీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నాం అని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. 

Also Read:  ఏపీపై దానా తుపాన్‌ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

సిన్వర్‌ మరణం ఒక ఒప్పందానికి..

కైరో సమావేశం తరువాత ఇజ్రాయెల్‌ కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఖతార్‌ కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. గతేడాది అక్టోబర్ 7 న హమాస్‌ దాడులకు సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిన్వర్‌ మరణం ఒక ఒప్పందానికి దారితీస్తోందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. 

Also Read: ఆధార్ కార్డు చెల్లదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలోనే ఆ దిశగా చర్చలు జరుగుతుండడం గమనార్హం. గతేడాది అక్టోబర్ 7 నాటి దాడుల్లో పాల్గొన్న కమాండర్‌ మహ్మాద్ అబు ఇతివిని హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ దళాలు తెలిపాయి. అయితే మృతి చెందిన వ్యక్తి ఐక్యరాజ్య సమితి సహాయ ఏజెన్సీ కోసం పని చేస్తున్నట్లు వెల్లడించింది. హమాస్‌ సైనికుల్లో యూఎన్ ఏజెన్సీకి చెందిన సభ్యులు పని చేస్తున్నారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. 

ఈనేపథ్యంలోనే గతేడాది అక్టోబర్‌ 7 నాటి దాడుల్లో పాల్గొన్న 9 మంది సభ్యులను యూఎన్‌ బాధ్యతల నుంచి తొలగించింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు