Maharashtra: కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..మహారాష్ట్రలో పోటీకి సిద్ధం

మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాకిచ్చింది ఎంఐఎం. పది లేదా పన్నెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నామంటూ ప్రకటించింది. నలుగురికి బీఫామ్ కూడా ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పక్షం వహించిన ఎంఐఎం ఇప్పుడు ఇలా వ్యతిరేకం అవడంతో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలినట్టయింది. 

New Update
maharashtra

MIM In Maharshtra: 

మహారాష్ట్రాలో మోగిన ఎన్నికల నగారా ఇపుడు తెలంగాణాలోనూ బాగా శబ్దం చేస్తోంది. దానికి కారణం ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగుతుండడమే. అది కూడా ఒకటి, రెండు స్థానాల్లో కాకుండా..చాలా స్థానాల్లో..ఎవరితోనూ పొత్తు పెట్టుకోకండా స్వతంత్రంగా దిగుతోంది ఎంఐఎం. తమ పార్టీని విస్తరించే క్రమంలో ఇప్పుడు మహారాష్ట్రలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది ఆపార్టీ. కీలకమైన స్థానాల్లో పోటీ చేసి అక్కడ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చూస్తోంది. దీనికి సంబంధించి అన్ని రకాలుగా సిద్ధమైంది మజ్లిస్ పార్టీ. నలుగురికి బీ ఫామ్‌లు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. బారీగా ప్రచారం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌కు షాక్...

అయితే ఎంఐఎం ముందు నుంచీ మహారాష్ట్ర ఎన్నికల్లో దిగుతుందని తెలుసు. అయితే కాంగ్రెస్‌తో పొత్తుతో దిగుతుందని అనుకున్నారు అంతా. మహారాష్ట్ర పక్క రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా ఎంఐఎం కాంగ్రెస్‌ను మొదట్లో చాలా సపోర్ట్ చేసింది. దాని ద్వారానే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎంఐఎం తో పొత్తు పెట్టుకుందామని అనుకుంది కాంగ్రెస్. మహారాష్ట్రలో ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంది. ఇక్కడ 28 స్థానాల్లో ముస్లిం ఓటర్లు ఉన్నారు.  దాంతో ఇవి కలిస్తే కాంగ్రెస్ కూటమికి చాలా బలం చేకూరుతుంది. కానీ ఎఐఎం విడిగా పోటీ చేయడం వలన ఈ ఓట్లు చీలిపోతాయి. ఇది కాంగ్రెస్కు దెబ్బ అనే చెప్పాలి. అయితే  మరోవైపు కాంగ్రెస్సే వ్యూహాత్మకంగా శివసేన, ఎన్సీపీలతో కూటమిగా ఉంటూ ఎంఐఎంను దూర పెట్టింది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ఎంఐఎం ఆ పార్టీని బాగానే స్పోర్ట్ చేసింది. అయితే తర్వాత మాత్రం ఇద్దరి మధ్యా పెద్దగా సయోధ్య కనిపించడం లేదు. ముఖ్యంగా హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం బాగా వ్యతిరేకిస్తోంది. మూసీ రివర్ ఒడ్డున ఇళ్ళు కూల్చేయడం పై కూడా ఆ పార్టీ మండిపడుతోంది. దాంతో పాటూ హరియాణా ఎన్నికల విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్‌గానే విమర్శించారు. అంతర్గత కుమ్ములాట వల్లే ఓడిపోయారని ఫైర్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీ మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగాలని ఎంఐఎం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

మహరాష్ట్రలో...

గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపించింది. అప్పుడు వీబీఏతో కలిసి పోటీ చేసిన ఎంఐఎం చాలా స్థానాల్లో గెలిచి సత్తా చాటుకుంది. అయితే ఈసారి ఈ రెండు పార్టీలు సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వీబీఏ ఇప్పటికే 20 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఎంఐఎం ఔరంగాబాద్ సహా ఏడు స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ముంబైలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం మహారాష్ట్ర చీఫ్ జలీల్ తెలిపారు. థానే, కళ్యాణ్ లలోని రెండు స్థానాలను కలిపి ముంబై చుట్టుపక్కల సుమారు ఎనిమిది స్థానాలు ఉన్నాయని, వాటిలో రెండింటిలో పోటీ చేయడానికి అభ్యర్థులను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. అలాగే, పుణె, బీడ్, నాందేడ్, బుల్ధానా స్థానాల్లో కూడా ఎంఐఎం అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో ఎంతో కొంత ఓటుబ్యాంక్‌ను సాధించి...ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తోంది ఎంఐఎం. దీనికి ఎంట్రీ భారీగా ఉండాలని ప్లాన్‌ చేస్తోంది.   అందుకు తగినట్టు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అధ్యక్షుడు అసద్‌ కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా సమయం గడుపుతూ.. స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు.

Also Read: J&K: జేకే సీఎం ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని భేటీ..రాష్ట్ర హోదాపై చర్చ 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు