ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఏ నిమిషం ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అనే విధంగా ప్రస్తుతం పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని వార్నింగ్ ఇచ్చింది. ఇదే కానీ జరిగితే టెహ్రాన్ కూడా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇది కూడా చూడండి: America:ఆమె చాలా ఆరోగ్యవంతంగా ఉంది...అధ్యక్షురాలిగా సరైన క్యాండిడేటే!
ప్రతిచర్య తప్పదు..
రెండు దేశాల మధ్య ఉన్న వివాదాల గురించి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న దేశాల్లో అమెరికా ఒకటి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు ఇరాన్ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. సాయం చేసిన తర్వాత జరిగే పరిణామాలను తెలుసుకోవాలని హెచ్చరించింది. తమ శత్రు దేశమైన ఇజ్రాయెల్‌కు సహకరిస్తే.. తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామని తెలిపింది. దీనికి ప్రతిచర్యగా టెహ్రాన్ కూడా దాడులు చేస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: నువ్వా–నేనా అంటున్న కమలా, ట్రంప్..ఫలితాన్ని నిర్ణయించనున్న స్వింగ్ స్టేట్స్
హెజ్‌బొల్లాపై విచక్షణ రహితంగా దాడులు చేయడం, కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయెల్‌పై దాడికి దిగినట్లు ఇటీవల ఇరాన్ ప్రకటించింది. ఇప్పటి వరకు హమాస్, హెజ్‌బొల్లాకు పరోక్షంగా ఇరాన్ సాయం చేసింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇరాన్ యుద్ధంలోకి దిగింది. అమెరికా దేశం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఇరాన్ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై యూఎస్ ఆంక్షలు పెంచినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: విచిత్రం.. ఎడారిలో పోటెత్తిన వరదలు.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు..