America:ఆమె చాలా ఆరోగ్యవంతంగా ఉంది...అధ్యక్షురాలిగా సరైన క్యాండిడేటే!

అమెరికా ఉపాధ్యక్షురాలు , డెమోక్రటిక్‌ పార్టీ తరుఫున అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్‌ ఆరోగ్యం చాలా బాగుందని ఆమె వైద్యులు తెలిపారు. అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించేందుకు ఆమె ఫిట్‌ గా ఉన్నారని చెప్పారు.

New Update
Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్య‌క్షురాలిగా కమలా హ్యారిస్‌!

America: అమెరికా ఉపాధ్యక్షురాలు , డెమోక్రటిక్‌ పార్టీ తరుఫున అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్‌ ఆరోగ్యం చాలా బాగుందని , అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించేంఉదకు ఆమె ఫిట్‌ గా ఉన్నారని ఆమె వైద్యులు జాషువా సిమన్స్‌ వెల్లడించారు. కమలా దేశాధ్యక్షురాలిగా పని చేసేందుకు శారీరకంగా, మానసికంగా ఫిట్‌ గానే ఉన్నట్లు ప్రకటించారు.

Also Read: ముఖ్యమంత్రిని చంపేస్తానంటూ బెదిరింపులు!

ఈ మేరకు హారిస్‌ మెడికల్‌ హిస్టరీ, ప్రస్తుత స్థితికి సంబంధించి రిపోర్ట్‌ ను విడుదల చేశారు. యూఎస్‌ ఆర్మీ కర్నల్‌, ఫిజీషియన్‌ అయిన డాక్టర్స్‌ సిమన్స్‌ తాను మూడున్నరేళ్లుగా హారిస్‌ కు వైద్యుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. 59 ఏళ్ల కమలా ఆరోగ్యంగా, చురుకైన జీవన శైలిని కొనసాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 

Also Read: ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

తన విధులను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఫిట్‌ నెస్‌ ఆమె కలిగి ఉన్నట్లు చెప్పారు. కమలా అలర్జీ సమస్య ఉందని, దీని కోసం ఆమె అలర్టీ ఇమ్యునో థెరపీ చేయించుకుంటున్నట్లు చెప్పారు.కొన్నేళ్లుగా ట్రంప్‌ తన ఆరోగ్యానికి సంబంధించిన పరిమితంగానే సమాచారం విడుదల చేస్తూ వస్తున్నారు.

Also Read:సొంతూర్లో దసరా పండుగ జరుపుకున్న సీఎం రేవంత్..

జులైలో తన పై హత్యాయత్నం జరిగినప్పుడు చెవికి బుల్లెట్‌ గాయమైన తరువాత కూడా చాలా తక్కువ సమాచారమే ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన వైద్యుడు విడుదల చేసిన లేఖను కమలా ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుని తన ప్రత్యర్థి ట్రంప్‌ ను మరింత ఇరాకాటంలో పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Also Read: ఉద్యోగులకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ.. ఎక్కడంటే ?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు