/rtv/media/media_files/2026/03/03/israel-us-attack-iran-2026-03-03-21-23-58.jpg)
Iran : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం ఖమేనీ నేలకొరిగినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఖమేనీ ఉన్నా లేకున్నా తగ్గేదేలే అంటూ యుద్దం చేస్తూనే ఉంది.సుప్రీం చచ్చినా సూపర్ పవర్ అలాగే ఉందంటున్న ఇరాన్ అమెరికా మితృదేశాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇంతకు..ఇరాన్‌కున్న దమ్మేంటి? ఖమేనీ లేకున్నా ఇరాన్‌ను నడిపిస్తున్న హిడెన్ పవర్ ఏంటి? ఆర్మీ, ఆయుధాలు, రక్షణ సిబ్బంది, స్పెషల్ ఫోర్స్‌ఇవన్నీ అన్ని దేశాలకు ఉండేవే. కానీ, ఇరాన్‌లో ఇంకో శక్తి ఉంది. అది చాలా పవర్ ఫుల్.
సూపర్ వెపన్ లాంటి ఇజ్రాయెల్ బిగ్ బాస్ లాంటి అమెరికా ఇతర దేశాలన్నీ ఏకమై దూకినా వెన్నుచూపని ఇరాన్‌కు ఖమేనీ సృష్టించిన రహస్య రక్షణ బలగాలే బలం. ఖమేనీ ఉన్నా లేకున్నా అవి డెడ్ ఎండ్ వరకు ఫైట్ చేస్తూనే ఉంటాయి. చివరి క్షణం వరకు ఇరాన్ కోసం ప్రాణాలిస్తాయి. భూగర్భంలో మిస్సైల్స్ సిటీలున్న దేశం ఇరాన్. టెహ్రాన్‌తో పాటు దేశం సరిహద్దుల్లో భూమి లోపల క్షిపణుల నగరాలున్నాయి. వీటిలో ఉన్న సైన్యం ఎవరో ఉన్నతాధికారులకు కూడా తెలియదు. అంతేకాదు,10000 కి.మీ. టార్గెట్ వరకు వెళ్లగలిగే బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ సొంతం.దీనికి తోడు IRGC ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ,మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సపోర్టర్స్ ప్రాక్సీ నెట్ వర్క్, సముద్ర గనుల్లో ఇరాన్ సీక్రెట్ ఆర్మీ ఇవన్నీ ఇరాన్ బలాలే.
ఇరాన్ శక్తి గ్యాస్, చమురు..వీటిని కాపాడుకుంటే ఎంత పెద్ద దేశాన్నైనా ఢీ కొట్టచ్చనేది ఇరాన్ వ్యూహం. అధునాతన డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీ,సైబర్ దాడులతో పాటు ఇరాన్ రహస్య శక్తుల్లో అణుబాంబులు మరొకటి.యురేనియం నిల్వలతో ఎంత పెద్ద యుద్ధమైనా ఇరాన్ సై అంటుంది. ఖమేనీ లేకపోయినా ఆయన సృష్టించిన రక్షణ వ్యవస్థ ఇరాన్‌ను నడిపిస్తూనే ఉంటుంది. మొదటి నుంచీ ఖమేనీ పెంచి పోషించిన లెబనాన్ మిలిటెంట్లు, హమాస్ ఉగ్రవాద సంస్థలు ఇరాన్‌కు ఇనుప కవచాల్లాంటివని చెప్పచ్చు.
లెబనాన్ నుంచి ఇరాన్‌కు సొరంగ మార్గాలున్నాయని చెబుతారు. మత సంస్థలకు, ఆర్మీకి, రహస్య శక్తులకు సుప్రీం ఖమేనీనే బాస్. ఆయన పదేళ్ల కిందట ఆర్డర్ ఇచ్చాడంటే.. ప్రస్తుతం ఆయన లేకున్నా అవి అమల్లో ఉండాలన్నదే దానర్థం. అందుకే ఇరాన్ ఇంత ధీటుగా అమెరికాతో సై అంటోంది. సుప్రీం చచ్చినా చావోరేవో అని ఢీ కొడుతోంది. ఎన్ని దేశాలు ఏకమైనా ఏం పీకలేరని ఎదురెళ్తోంది.
Follow Us