ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హెచ్చరిక

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ జెష్కియాన్ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మాతో గొడవలకు దిగవద్దు. ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని బెంజమిన్ నెతన్యాహుకి తెలియజేయండని అధ్యక్షుడు సోషల్ మీడియా ద్వారా ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.

masood
New Update

ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం విరుచుకుపడింది. దాదాపుగా 200 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై వర్షం కురిపించింది. అయితే ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రజల ప్రయోజనాలు, వారి రక్షణను దృష్టిలో పెట్టుకుని దాడులు ప్రారంభించామని, ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని బెంజమిన్ నెతన్యాహుకు తెలియజేయండని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మాతో గొడవలకు దిగవద్దని సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయోల్‌పై ఇరాన్ దాడి ముగిసిందని.. ఆ దేశం ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటే మా దాడులు ఆగినట్లేనని అన్నారు. పగ తీర్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే తిరిగి మళ్లీ దాడులు ప్రారంభిస్తామని, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమేనని హెచ్చరించారు. 

ఇది కూడా చూడండి: తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఎలా పూజించాలి?

దాదాపు 200 క్షిపణులతో..

హమాస్, హెజ్బులాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ఆ దేశం మీద ఇరాన్ దాడులను మొదలుపెట్టింది. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. దీంతో ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ దాదాపుగా 200 క్షిపణులు ప్రయోగించినట్టు తెలుస్తోంది. టెల్ అవీవ్, జెరూసలేం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్‌కు ధీటుగా ఇజ్రాయెల్ సైన్యం స్పందిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఐరన్‌ డోమ్‌ వంటి సాంకేతిక వ్యవస్థలు.. క్షిపణులను దీటుగా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్

#hamas #hezbollah #iran-israel-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe