Iran : ప్రతీకార దాడులకు దిగిన  ఇరాన్.. ఏకకాలంలో ఎనిమిది దేశాలపై ఎటాక్

తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలపై దాడి మొదలు పెట్టింది. ఏకకాలంలో ఎనిమిది దేశాలపై ఇరాన్‌ ఎటాక్‌ చేసింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతోపాటు అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈ ల పై దాడులు చేసింది.

New Update
iran

Iran-america war

 Iran : తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్‌ పాటు ఇతర  దేశల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి మొదలు పెట్టి్ంది. ఏకకాలంలో ఎనిమిది దేశాలపై ఇరాన్‌ ఎటాక్‌ చేయడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతోపాటు అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈ లలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగింది. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. దాడుల చిత్రాలు భయానకంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇరాన్‌ దాడులను దారిలో వెళుతున్న వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

ఇరాన్ మధ్యప్రాచ్యంలోని ఏడు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. పేలుళ్లు, మంటలు, పొగ, శబ్దాలు ప్రతిచోటా కనిపించాయి. పేలుళ్ల ప్రతిధ్వనులు సౌదీ అరేబియా, ఖతార్. యుఎఇ నుండి వినిపించాయి. ఈ దాడులను ఇరాన్ తనపై జరిగిన దాడులకు ప్రతీకారంగా నిర్వహించింది.  ఇరాన్ దాడులతో టెల్ అవీవ్‌లో సైరన్ల మోత మోగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ లక్ష్యంగా ఉంది. దేశంలోని ప్రతిచోటా సైరన్లు వినిపిస్తున్నాయి. ఇరాన్‌ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్‌  అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశంలోని స్కూళ్లు, కార్యాలయాలను ముందస్తుగా మూసివేసి సెలవులు  ప్రకటించారు. గగనతలంలోనూ నిషేధం విధించారు. 

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌, అమెరికా దాడులపై ఇరాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడికి ప్రతిదాడి తప్పదని హెచ్చరించింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు. కానీ దీని ముగింపు మాత్రం మా చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ సైన్యం అమెరికా, ఇజ్రాయెల్‌లకు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు