/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
ఇరాన్ లో ప్రస్తుతం నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడ నెట్ వర్క్ బ్లాక్ అవుట్ కూడా అయింది. జనవరి 8, 2026 రాత్రి నుండి ఇరాన్‌లో ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా 111 కి పైగా నగరాల్లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. జనవరి 9, 2026న, ఇరాన్ రాష్ట్ర టీవీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేసింది. ఈ ప్రకటన టెహ్రాన్‌తో సహా అన్ని ప్రధాన నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రసారం చేయబడింది. ఇందులో ఎరవైతే గొడవలు చేస్తున్నారో, సృష్టిస్తున్నారో వారికి ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా తమ దేశం విషయంలో జోక్యం చేసుకోవాలనుకుంటున్న అన్ని దేశాలనూ హెచ్చరించారు.
మమ్మల్నేం చేయలేరు
తాము ఎప్పటికీ తలవొంచమని..శత్రువే తమ కాళ్ళ పడేలా చేసుకుంటామని ఖమేనీ అన్నారు. ఉగ్రవాద ఏజెంట్లను సహించమని...వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కుంటారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి సొంత దేశంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కొంతమంది అల్లర్లు చేసి ప్రజా ఆస్తులను దెబ్బతీసి అమెరికా అధ్యక్షుడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. ట్రంప్ తన సొంత దేశం గురించి ఆందోళన చెందాలి, ఎందుకంటే ఇరాన్ విదేశీ ఒత్తిడికి తలొగ్గదు అని చెబుతూ ఖమేనీ అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ ప్రజలను ఇంత కంటే ఎక్కువగానే హెచ్చరించామని...అనవసరమైన గొడవలు చేస్తే భారీ పరిణామాలు ఎదుర్కుంటారని ఖమేనీ అన్నారు. దీంతో పాటూ ట్రంప్ ను కూడా ఖమేనీ విమర్శించారు. ఇరాన్ విషయంలో కాకుండా సొంత దేశ వ్యవహారాల మీద దృష్టి పెట్టాలని చెప్పారు.
అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఇరాన్ ప్రభుత్వాన్ని(Iran Government) హెచ్చరించారు. ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యా్ఖ్యలు చేశారు.'' ఇరాన్‌లో నిరసనలు చెలరేగినప్పుడు అక్కడి దేశాధినేతలు వీటిని అణిచివేయాలనుకుంటారు. ఇది సహజం. కానీ ఈసారి కూడా అలా చేస్తే మేము జోక్యం చేసుకుంటాం. వాళ్లని తీవ్రంగా దెబ్బతీస్తామని'' అన్నారు.
Follow Us