Israel: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం..గల్ఫ్‌ దేశాల ఆందోళన!

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గల్ఫ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేయనుందనే వార్తలతో రాయబారం మొదలుపెట్టాయి.

New Update
attacks

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గల్ఫ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేయనుందనే వార్తలతో రాయబారం మొదలుపెట్టాయి. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మధ్యవర్తిత్వం స్టార్ట్ చేశాయి. 

Also Read: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు

ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సౌదీ ఆరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌, ఖతార్ సహా గల్ఫ్‌ దేశాలన్ని అమెరికాతో లాబీయింగ్ చేస్తున్నాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధించాలని అమెరికాను కోరుతున్నాయి. తమ గగనతలం ఉపయోగించుకోకుండా ఇజ్రాయెల్‌పై నిషేధం విధిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. 

Also Read: యాదాద్రి లడ్డూ క్వాలిటీ.. ల్యాబ్ రిపోర్ట్ లో ఏం తేలిందంటే?

ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిస్సైల్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఐతే అప్పటి నుంచి ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరాన్ మరింత తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశం ఉందని, ప్రపంచంలోనే చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసే ఇరాన్ మూసివేసే అవకాశం ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుచాయని అంచనా వేస్తున్నారు. 

ఇజ్రాయెల్- ఇరాన్‌ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఇరాన్.. ఇజ్రాయెల్‌ దాదాపు 200 క్షిపణులతో దాడి చేయడం సంచలనం రేపింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై పగతో రగిలిపోతోంది. ప్రతీకార దాడులు తప్పవని కూడా హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సైనిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇరాన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

Also Read: లాభాల వద్ద ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

మరోవైపు ఇరాన్‌ కూడా తగ్గేదే లేదంటోంది. తమపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడితే తిప్పి కొడుతామని హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ఇజ్రాయెల్‌ కౌంటర్‌కు అటాక్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఇరాన్‌లో ఉన్న అణుకేంద్రాలపై దాడులు చేయొద్దని సూచనలు చేశారు. అటు అమెరికా యుద్ధదళాలు సైతం మధ్యధరా సముద్రంలో, అలాగే పర్షియన్ గల్ఫ్‌లో కూడా అలెర్ట్‌గా ఉంటున్నాయి. ఎప్పుడు పరిస్థితులు తీవ్రతరమైనా వాటిని ఎదుర్కొనేందుకు ఈ దళాలు సిద్ధంగా ఉన్నాయి. 

దీవిపై దాడులు జరిగితే ?

అయితే పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్‌ అనే చిన్నదీవి ఉంది. ఇది ఆ దేశానికే ఆయువు పట్టులాంటింది. ఈ ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు కూడా ఇక్కడి నుంచే పెట్రోలియం సరఫరా జరుగుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ దీన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో కూడా ఇరాన్-ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో సద్దాం హుస్సేన్ గ్రూప్‌ ఈ దీవిపై దాడులకు పాల్పడ్డాయి. 

అలా జరిగితే చమురు సంక్షోభమే

ఈ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన పలు దీవుల ద్వారా చమురు వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఇతర దేశాలైన కువెట్, ఇరాక్, సౌదీ అరేబియా, బహ్రయిన్, ఖతార్‌ దేశాలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ సైతం ఈ తీరప్రాంతంలోనే ఉన్నాయి. హెర్ముజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే జలసంధి విస్తీర్ణం చూసుకుంటే ఎక్కువభాగం ఇరాన్ ఆధీనంలోనే ఉంటుంది. అయితే ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే.. ప్రపంచంలో చమురు సంక్షోభం నెలకొంటుంది. 
ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి పర్షియన్‌ గల్ఫ్‌ను, ఒమన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న చమురులో ఐదో వంతు చమురు హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది.

Also Read: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?

Advertisment
Advertisment
తాజా కథనాలు