Iran: మీథేన్‌ గ్యాస్‌ లీకై పేలుడు..51 మంది మృతి!

ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

author-image
By Bhavana
Iran
New Update

Iran :  ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో  20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. 

తూర్పు ఇరాన్‌లోని తబాస్ గనిలో పేలుడు సంభవించినట్లు అధికారిక వార్తా సంస్థ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 70 మంది ఉద్యోగులు సైట్‌లోనే ఉన్నట్లు వివరించింది. అధికారులు తెలిపిన నివేదికల ప్రకారం.. గనిలోని రెండు బ్లాకులలో పేలుడు జరిగింది. ఈ గని ప్రైవేట్ ఇరానియన్ సంస్థ మదంజూ యాజమాన్యంలో ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు తబాస్‌కు అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు సాయం చేశాయి. 

అలాగే.. కొంతమంది బాధితుల మృతదేహాలను మైనింగ్ వాహనాలలో ఆస్పత్రికి తీసుకెళ్లాయి. మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్‌లు పనిచేస్తున్నాయని సౌత్ ఖొరాసన్ గవర్నర్ జవాద్ ఘెనాట్ మీడియా సంస్థలకు తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. అలాగే సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. 

“దురదృష్టవశాత్తూ తబాస్‌లోని బొగ్గు గనులలో ప్రమాదం జరిగిందని.. మా ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్నాము. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పెజెష్కియాన్ అన్నారు.

Also Read :  అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు..

 

#iran #coal-mines
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe