Donald Trump : 7 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తొమ్మిది నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు. తాను ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.

New Update
Donald Trump

Donald Trump

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తొమ్మిది నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు. ఈ ఏడు యుద్ధాలలో భారత్,  పాకిస్థాన్‌తో సహా కంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, కాంగో-రువాండా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య ఘర్షణలు ఉన్నాయని ఆయన తెలిపారు.

నాకు అసలైన నోబెల్‌ బహుమతి అదే

 ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నానని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే నాకు అసలైన నోబెల్‌ బహుమతి అని చెప్పారు.  యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందన్నారు ట్రంప్. ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయిందంటూ కామెంట్స్ చేశారు. ఖాళీ మాటలు యుద్ధాలను పరిష్కరించవని ట్రంప్ కామెంట్స్ చేశారు. యుద్ధాలను ఆపడానికి ప్రతి దేశ నాయకులతో మాట్లాడానని,  కానీ ఐక్యరాజ్యసమితి నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు. ఇక భారత్,చైనా రష్యాకు సాయం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు.  చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తూ రష్యాకు సాయం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడంలో ఐరోపా, నాటో దేశాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు