Pakistan Bomb Blast: పాక్‌లో భారీ బాంబు పేలుడు.. ఆరుగురు మృతి

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. పాక్‌లోని  క్వెట్టా నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది

New Update
Bomb blast in Pakistan

Bomb blast in Pakistan

Pakistan Bomb Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పాకిస్థాన్‌ అలర్ట్‌ అయింది. పాక్‌లోని  క్వెట్టా నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది.  పేలుడు అనంతరం కాల్పుల మోతలు వినిపించాయి. ఈ ఘటన అనంతరం నగరంలోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

ప్రధాన రహదారి మీద జరిగిన ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.  బాంబుపేలుడు దాటికి ఆరుగురు మృతిచెందగా, 19 మంది గాయపడినట్టు పోలీసులు చెప్పారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  ఈ పేలుడు పై స్పందించిన బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. లీవులో ఉన్న కన్సల్టెంట్‌లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

కాగా ఈ పేలుడుకు కారణం ఆత్మాహుతి దాడి కావచ్చని పాకిస్థాన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. పేలుడు అనంతరం చుట్టుపక్కల పెద్దఎత్తున పొగలు వ్యాపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా పేలుడు దృశ్యం స్థానికంగా  ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. సెప్టెంబర్ 4న కూడా క్వెట్వాలో ఒక పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తుండగా కూడా బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. కాగా ప్రస్తుత పేలుడుకు కారణం ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. ట్రోఫీ లేకుండా విజయాన్ని ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు.. ఫొటోలు చూశారా?

Advertisment
తాజా కథనాలు