Hezbollah: నస్రల్లా ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది? ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత నస్రల్లా మరణించారు. అసలెవరికీ బయటకు కనిపించిన ఆయన ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది. ఎప్పటి నుంచి నస్రల్లా మీద ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. వివరాలు ఈ కింది ఆర్టికల్‌లో చదవండి. By Manogna alamuru 28 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hezbollah Commander Nasrallah: హెజ్బుల్లా అధినేత ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత నస్రల్లా మరణించారు. అసలెవరికీ బయటకు కనిపించిన ఆయన ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది. ఎప్పటి నుంచి నస్రల్లా మీద ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. చాలా కాలం నుంచి బంకర్ల నుంచి బయటకు రావడం లేదు. ఎప్పుడూ కనిపించినా..వీడియోలు, టీవీలలోనే సందేశమిస్తారు. దాదాపు 32 ఏళ్ళుగా హెజ్బుల్లానే ఇతనే నడిపిస్తున్నారు. ఈ సంస్థను పెద్ద సాయుధదళంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు. బీరూట్‌లో పెద్ద పెద్ద భవనాల కింద ఉన్న సెల్లార్లలో ఉన్న బంకర్లలో నస్రల్లా ఉండేవారు. వీటిని ఏ బాంబులూ ఛేదించలేవు. మరోవైపు ఇజ్రాయెల్ చాలా కాలంగా హెజ్‌బొల్లా టాప్ కమాండ్‌పై దృష్టిపెట్టింది. ఫహద్‌షుకుర్, ఇబ్రహీం అకిల్..తదితరులను వైమానిక దాడులతో చంపేసింది. దాంతో పాటూ నస్రల్లా మీద కూడా గట్టి నిఘా పెట్టింది. నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఆయుధంగా వాడుకుంది. మరొకవైపు ఇజ్రాయెల నిఘా విభాగం లెబనాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సైన్యానికి అందించింది. బీరూట్‌లోని పెద్దభవనాల్లోని కింద ఉన్న సెల్లార్లలో ఆయన ఉంటారన్న సమాచారం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. దీంతో సాధారణ బాంబులు ఛేదించలేని బంకర్ల కోసం ఇజ్రాయెల్ అమెరికా నుంచి బంకర్ బస్టర్ జీబీయూ 28ను రంగంలోకి దించింది. నిఘి వర్గాల సమాచారం ప్రకారం దీంతో బీరుట్ అపార్ట్‌మెంట్లపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఇందులో బాంబులు అపార్ట్‌మెంట్ల నేళమాళిగల్లోకి చొచ్చుకుపోయాయి. వీటల్లోనే నస్రల్లా మరణించారు. ఈ క్రమంలో ఆయన కూతురు కూడా మృతి చెందింది. హమాస్‌తో యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచీ ఇజ్రాయెల్ టెక్నాలజీని విపరీతంగా వాడుతోంది. ఈ టెక్నాలజీ సాయంతో నిఘావర్గాల సమాచారంతో లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడులు చేస్తోంది. ఐరన్‌డోమ్, క్షిపణులు, ఎఫ్-35 విమానాలు, డ్రోన్లు, నిఘాపరికరాలను సమకూర్చుకుని హమాస్, హెజబ్లులాల మీద విరుచుకుపడింది. నస్రుల్లా మరణంతో హెజ్బుల్లా దాదాపు నాశనం అయినట్టేనని వార్తలు వస్తున్నాయి. Also Read: south Korea-డీప్ ఫేక్ బిల్లును ఆమోదించిన దక్షిణ కొరియా #israel #hezbollah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి