Iran Ex President Mahmoud Ahmadinejad:
టెహ్రాన్‌లోని మొస్సాద్ సంస్థ అత్యంత బలంగా వేళ్ళనుకుని పాతుకుపోయిందని అంటున్నారు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదిజాన్. దానికి నిదర్శనమే తమ ఇంటలిజెన్స్ అధిపతి మొస్సాద్ సంస్థకు సీక్రెట్‌గా మారిపోవడం అని చెప్పారు. సీఎన్‌ఎన్ తుర్క్ ఛానెల్‌కు మహమూద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొస్సాద్ సంస్థ మొత్తం మా ఇంటలిజెన్స్ యూనిట్స్ తమ వైపుకు తిప్పుకుందని మహమూద్ చెప్పారు. దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది ఇజ్రాయెల్‌కు
డబుల్ ఏజెంట్లుగా మారిపోయారని వాపోయారు. తమ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన అణు రహస్యాలను వారికి చేరవేశారని చెప్పారు. మహమూద్ మాటలు ఇప్పుడు ఇరాన్‌లో కలకలం రేపుతున్నాయి.టెల్ అవివోలో గుబులు మొదలయ్యేలా చేశాయి. ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మా నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారన్న విషయం 2021లోనే బయటపడిందని మహమూద్ చెప్పుకొచ్చారు.
తమ ఇంటలిజెన్స్ సభ్యులు, అధిపతి వారి ఏజెంట్లుగా మారిపోవడంతో మొసాద్ దాదాపు 1,00,000 అణు పత్రాలను అపహరించిందని మాజీ అధ్యక్షుడు వివరించారు. దీని కోసం ఆ సంస్థ క ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించిందని చెప్పారు. వాటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బహిర్గతం చేశారు. ఇరాన్ ఏవిధంగా సీక్రెట్‌గా అణు కార్యక్రమాలు నిర్వహిస్తోందో.. వాటిలో స్పష్టంగా ఉన్నాయి. దీని వలన ఇరాన్ అణు లక్ష్యాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని అన్నారు. టెహ్రాన్‌లోని రహస్య స్థావరాల్లోకి కూడా మొసాద్ ఏజెంట్లు దూరగలిగారు. ఇలాంటి వారు దాదాపు 25 మంది దాకా ఉన్నారని మహమూద్ చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల వెనుక కూడా ఈ గుఢచారులు అందించిన సమాచారం ఉందని...అందుకే ఆ దేశం సైన్యం దాడులు గురి తప్పకుండా అందరినీ మట్టుబెడుతున్నాయని చెప్పుకొచ్చారు.
Also Read: J&K: మూడో విడత కూడా అయిపోయింది..జేకేలో అక్టోబర్ 8న ఫలితాలు