తమపై దాడులకు దిగిన హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. గురువారం దక్షిణ గాజా స్ట్రిప్‌లో చేపట్టిన దాడిలో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టామని పేర్కొంది. డీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతుల్లో ఒకరు హమాస్ చీఫ్ అయిన యహ్యా సిన్వార్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా హమాస్ కూడా దీనిపై స్పందించింది. తమ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించింది. ఈ మేరకు శుక్రవారం హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ హయ్యా ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
పాలస్తీన్‌ను సాధించేవరకు పోరాడుతాం
తమ స్వేచ్ఛ కోసం సిన్వార్ తన ప్రాణాలనే త్యాగం చేశారంటూ కొనియాడారు. ధైర్యంతో పోరాడి మా నుంచి దూరంగా వెళ్లిపోయారని.. తన చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నారంటూ ప్రశసించారు. సిన్వార్ మరణం హమాస్ బలాన్ని మరింత పెంచుతుందని అన్నారు. పాలస్తీనియన్ల మట్టిపై పాలస్తీనా స్టేట్‌ను ఏర్పాటు చేసి.. దాని రాజధానిగా జెరుసలెంను చేసేవరకు హమాస్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటుందని ఖరాఖండిగా చెప్పారు.
Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
కొనసాగుతున్న దాడులు
ఇదిలాఉండగా ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హమాస్ మిలిటెంట్లు1200 మంది ఇజ్రాయెల్ పౌరులను దారుణంగా చంపేశారు. అయితే ఈ ఉగ్రదాడికి యహ్యా సిన్వారే ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అప్పటి నుంచి సిన్వార్‌ను అంతం చేయాలని భావించిన ఇజ్రాయెల్ ఎట్టకేలకు ఆయన్ని హతమార్చింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు ఇరాన్, లెబనాన్ దేశాలతో కూడా యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసింది. ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు పేలిన ఘటన అనంతరం ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ కూడా హెచ్చరించారు. ఇప్పటికే హెజ్‌బొల్లా, హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది.
Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?
Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్