Hamas: యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే! పాలస్తీనా జాతిని కాపాడాల్సిన హమాస్ అది చేయకపోగా సొంత దేశంలోనే తమకు ఎదురుతిరిగివారిని ఎంతోమందిని చంపింది. తమ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని అంతమొందించిన వారిలో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన హమాస్ చీఫ్ సిన్వార్ ఎక్కువగా పాల్గొన్నారన్న ప్రచారముంది By Bhavana 21 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Hamas: తమకు అడ్డొస్తే చంపేయడం.. చిన్నారులు, మహిళలు అని కూడా చూడకపోవడం.. పోరాడుతున్నది ఇజ్రాయెల్ సైన్యంతో కానీ ఆ దేశపు ప్రజలతో కాదని తెలుసుకునే విచక్షణ లేకపోవడం..! ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో మరణించిన హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ ఓ నరరూప రాక్షసుడే! నిజానికి పాలస్తీనా బాధిత వర్గమే.. అక్కడున్నవారంతా పీడిత ప్రజలే. అగ్రరాజ్యాల కుళ్లు, కుతంత్రాలకు, ఇజ్రాయెల్ కండకావరానికి బలైపోయిన ప్రజలు పాలస్తీనీయన్లు. అందుకే హమాస్ సైనికులు వారికి తమను కాపాడే వీరుల్లానే కనిపిస్తారు. అయితే పాలస్తీనా జాతీని కాపాడాల్సిన హమాస్ అది చేయకపోగా సొంత దేశంలోనే తమకు ఎదురుతిరిగివారిని ఎంతోమందిని చంపింది. తమ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని అంతమొందించింది. ఇదంతా మావన హక్కుల ఉల్లంఘనే.. అందుకే యహ్యా సిన్వార్ ఓ కసాయే! Also Read: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..! 1962లో దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఓ శరణార్థి శిబిరంలో సిన్వార్ జన్మించాడు. పుట్టిన నాటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనీయన్లపై చేస్తున్న దారుణాలను కళ్లారా చూశాడు. గాజా శరణార్థి శిబిరాల్లో అతను అనుభవించిన నరకం అంతాఇంతా కాదని చెబుతుంటారు హమాస్ మద్దతుదారులు. నిజానికి శరణార్థి శిబిరాల్లో అందరి పరిస్థితి అలానే ఉంటుంది. పేద బాల్యంలోనే బతకాల్సిన దుర్భర పరిస్థితులు వారివి. ఎదురు తిరిగితే జైలుకు వెళ్లాల్సిందే. అలానే యహ్యా సిన్వార్ 22ఏళ్ల జైలు శిక్షను అనుభవించాడు. ఆ తర్వాత క్రూరంగా మారిపోయాడు. పాలస్తీనా జాతీని ఇజ్రాయెల్ నుంచి విముక్తి చేసేందుకు సాయుధ మార్గాన్ని ఎంచుకున్నాడు. అలా అంచెలంచెలుగా హమాస్ చీఫ్ స్థాయికి ఎదిగాడు. Also Read: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు! సొంత మనుషులను కూడా లెక్క చేయని... 2017లో సిన్వార్ గాజాలో హమాస్ నాయకుడయ్యాడు. సిన్వార్ నాయకత్వంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి పలుసార్లు హమాస్ సైనికులు చొరబడ్డారు. ఇజ్రాయెల్‌కు సొరంగ మార్గాలను నిర్మించాడు. ఇజ్రాయెల్ గడ్డపై అనేకసార్లు రాకెట్ దాడులు చేశాడు. ఇలా సిన్వార్ లీడర్‌షిప్‌లో హమాస్ అనేక హింసాత్మక ఘర్షణల్లో పాల్గొంది. రాజకీయ అణచివేత, అసమ్మతివాదులను ఉరితీయడం, ఘర్షణల సమయంలో విచ్చలవిడిగా ఆయుధాలను ఉపయోగించడంతో సహా పాలస్తీనియన్ల పట్ల హమాస్ వ్యవహరించిన తీరుపై చాలా ఆరోపణలున్నాయి. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే సొంత మనుషులను కూడా లెక్క చెయని నైజం సిన్వార్‌ది. Also Read: అలా అన్నందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఇజ్రాయెల్‌కు గూఢచర్యాలుగా ఉంటున్నరన్న అనుమానంతో అనేకమంది పాలస్తీనియన్లు చంపాడు సిన్వార్. ఇలా 'ఖాన్ యూనిస్ కసాయి'గా అపఖ్యాతి పాలయ్యాడు. ఖాన్ యూనిస్ నగరంలో ఎవరైనా ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌గా ఉన్నారని అనుమానం వస్తే చాలు సిన్వార్ వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇలా సొంత మనుషుల్లోనూ వ్యతిరేకత మూటగట్టుకున్న సిన్వార్ హమాస్ సంస్థపై మాత్రం గట్టి పట్టు సాధించాడు. అదే ఆయన్ను నాయకుడిని చేసింది. ఇజ్రాయెల్‌పై పోరాడేందుకు పాలస్తీనియర్లకు హమాస్ ఒక్కటే అతి పెద్ద ఆప్షన్. దీంతో అక్కడి స్థానికులు సైతం సిన్వార్‌ను స్వాగతించాల్సిన పరిస్థితి దాపరించింది. Also Read: బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం..! సెటిల్‌మెంట్ ప్రాంతాలపై... ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి బీజం వేసింది సిన్వారే! 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సైనికులు, పౌరులే లక్ష్యంగా హమాస్ దాడులకు దిగింది. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. 1200 మంది ఇజ్రాయెలీలు ఈ దాడుల్లో చనిపోయారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు.అక్టోబర్ 7 దాడులతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగింది. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా గడ్డపై నెత్తుటి వర్షాన్ని కురిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో 42వేల మంది పాలస్తీనీయన్లు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ దాష్ఠీకానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే తమ పౌరులను కాపాడుకోవడంలో సిన్వార్ ఈ ఏడాది కాలంగా పూర్తిగా విఫలమయ్యాడు. మావన హక్కులను యథేచ్ఛగా కాలరాస్తున్న ఇజ్రాయెల్ సైనికులతో సరైన రీతిలో పోరాడలేకపోయారన్న విమర్శలు సిన్వార్‌పై ఉన్నాయి. ఈ ఏడాది యుద్ధంలో అక్టోబర్ 7 ఘటన తర్వాత ఎక్కువగా కనపడని సిన్వార్.. వేలాది అమాయక పాలస్తీనియన్లను మరణిస్తున్నా తన వ్యూహాలకు పదును పెట్టకుండా విఫలమయ్యాడన్న వాదన ఉంది. ఇంతలోనే సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించాడు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి