Google: అమెరికాను వదిలి వెళ్ళకండి.. ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడప్పుడే ఎవరూ అమెరికా వదిలి వెళ్ళవద్దని చెప్పింది. వీసా ఇంటర్వ్యూలు అక్టోబర్ కు పోస్ట్ పోన్ అవుతుండడంతో..ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని కంపెనీ గట్టిగా హెచ్చరించింది.

New Update
google

అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా చాలా మంది దరఖాస్తుల దారుల వీసా అపాయింట్ మెంట్లు వాయిదాలు పడుతున్నాయి. మొదట ఇవి మార్చి , ఏప్రిల్ కు వాయిదా పడతాయి అని చెప్పారు. కానీ సోషల్ మీడియాను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేయడానికి టైమ్ పడుతుండడంతో వీసా ఇంటర్వ్యూల అపాయింట్ మెంట్లు మరింత వెనక్కు వెళ్ళనున్నాయని తెలుస్తోంది. ఇవి 2026 అక్టోబర్ కు నెలాఖరుకు వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి.. ప్రయాణాల కోసం టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వీసా కేంద్రాల దగ్గర చాలా మంది నిరసనలు కూడా దిగుతున్నారు. 

ఎక్కడికీ కదలొద్దు..

ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులను అమెరికా వదిలి వెళ్లవద్దని హెచ్చరించింది. అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తోందని..ఇలాంటి టైమ్ లో ఎక్కడికీ వెళ్ళకపోవడమే మంచిదని చెప్పింది. యూఎస్‌ వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి ఉద్యోగులు, సిబ్బందికి మెయిల్ పంపించింది. సోషల్ మీడియా వెట్టింగ్ కేవలం హెచ్ 1 మీదనే కాకుండా ఎల్ 1, ఎఫ్‌,జే,ఎం వంటి వీసాల పైనా ఈ ప్రభావం ఉంటుందని గూగుల్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆల్రెడీ అమెరికా బయట ఉన్నవారి సంగతి మాత్రం ఏం చెప్పలేదు. 

Advertisment
తాజా కథనాలు