ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో(UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనికి అంతర్జాతీయంగా మద్దతు వస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా భద్రతా మండలిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్ లాంటి దేశాలకు కచ్చితంగా ఇందులో స్థానం కల్పించాలని సూచనలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలు పరిష్కరించడం ప్రస్తుతం ఐక్యరాజ్యసమితికి సవాలుగా మారినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ ఇలా స్పందించింది.
Also Read: భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త!
భద్రతా మండలిని విస్తరించేందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు. భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నారు. అలాగే ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. UNSC అవలంబిస్తున్న విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామూహిక నేరాల కేసుల్లో వీటో అధికారాలకు పరిమితులు, శాంతిని నెలకొల్పడం కోసం అవసరమైన వ్యూహాలపై దృష్టి పెట్టడం లాంటి మార్పులు రావాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ కార్యచరణ చేపట్టేందుకు సమయం ఆసన్నమైనట్లు మెక్రాన్ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా..ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి.
Also Read: భారత పౌరులు లెబనాన్ ని వదిలి వెళ్లండి!