దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ మార్షల్ లా విధించి గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఆయన పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే అనుమానంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు స్థానిక మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.
Also Read: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్ లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్ ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్ ను నియమించారు. తన ఆదేశాల ప్రకారమే సైన్యం నడుచుకుందని, రాజీనామా చేసేందుకు సిద్ధం ఉన్నట్లు హ్యూన్ తెలిపారు.
Also Read: Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!
ఈ క్రమంలోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు సియోల్‌సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే దీని పై ఎటువంటి అధికారిక ప్రకటన విలువడ లేదు.ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ..యూన్ సుక్ యోల్ ఇటీవల ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే.దీని పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు.
Also Read: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు.చేసేదేం లేక వెనక్కి తగ్గిన అధ్యక్షుడు తన ప్రకటనను విరమించున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంట్ లో ఆయన పై అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు.
Also Read: అండర్ వేర్లు, చెప్పులపై హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వాల్ మార్ట్ దుమారం!
అటు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు మద్దతు కరవైంది. అయితే ఈ అభిశంసన తీర్మానం పై ఓటింగ్ ను అధికారి పీపుల్ పార్టీ బాయ్ కాట్ చేయడంతో పదవీ గండం ముప్పు నుంచి యోల్ తాత్కాలికంగా తప్పించుకోగలిగారు. పార్లమెంట్ ముందుకు అభిశంసన తీర్మానం రాకముందే ఆయన ఓ టెలివిజన్ ఛానెల్ లో మాట్లాడుతూ..దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు.