Africa ఎంగోంగా లిస్ట్‌ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్‌ అధికారి భార్య

ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో.. అతిపెద్ద సెక్స్ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంగోంగా 400 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ మహిళలలో దేశాధ్యక్షుని సోదరితో పాటు, పోలీసు అధికారి భార్య కూడా ఉన్నారు.

egoga
New Update

Equatorial Guinea Officer : ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో.. అతిపెద్ద సెక్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అవన్నీ చేసింది ఒక్కడే కావడం గమనార్హం. ఆ ఒక్కడు కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సివిల్ సర్వెంట్.  దాంతో ఈ విషయం ఆ దేశంలో సంచలనంగా మారింది. ఇది ఈక్వటోరియల్ గినియా దేశ చరిత్రలోనే అతి పెద్ద సెక్స్ కుంభకోణం అని చెబుతున్నారు. 

అయితే ఆ అధికారి 400 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు తేలడం.. వారంతా దేశంలోని ప్రముఖుల భార్యలు, కుటుంబ సభ్యులు కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. ఈక్వటోరియల్ గినియా ఆర్థిక నేరాల చీఫ్, 54 ఏళ్ల బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన సెక్స్ టేప్‌ల వ్యవహారం ప్రస్తుతం ఆ దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన దాదాపు 400 సెక్స్‌ టేపులు బయటపడటం తీవ్ర దుమారం రేపుతోంది. 

Also Read:  ప్రశాంతంగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

ఆ టేపుల్లో ఆ దేశ పోలీస్ చీఫ్ భార్య, ఆ దేశ అధ్యక్షుడి సోదరితో పాటు దేశంలోని కీలక ప్రముఖుల భార్యలతో బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆ వీడియోల్లో బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగాతో ఉన్న మహిళలు అందరూ కీలక వ్యక్తులు, వారి కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. 

Also Read:  ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం!

ఈక్వటోర్ గినియాలోని ప్రముఖ వ్యక్తుల భార్యలందరితో ఎబాంగ్ ఎంగోంగా లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయం బయటికి రావడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగా ఇల్లు, ఆఫీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ సమయంలో వందలాది సెక్స్ టేపులను అధికారులు గుర్తించారు.

Also Read:  దూసుకుపోతున్న ట్రంప్‌.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్‌ ఓట్లతో!

గినియా అధ్యక్షుడి సోదరి, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ భార్యతో సహా..

ఆ సెక్స్ టేపులు చూసి అధికారులు షాక్ అయ్యారు. అందులో ఈక్వటోరియల్ గినియా అధ్యక్షుడి సోదరి, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ భార్యతో సహా అనేక మంది వ్యక్తులతో బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగా.. శృంగారం చేస్తున్న వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. 

Also Read:  9 రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న ట్రంప్‌!

ఇప్పటివరకు 400కు పైగా సెక్స్ టేపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సెక్స్ కుంభకోణంపై ఈక్వటోరియల్ గినియా అధికారులు దర్యాప్తు చేపట్టారు.

#africa #sex-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe