Earth quake: రోజూ ఎక్కడోచోట భూకంపం..తాజాగా పపువా న్యూ గినియాలో..

ప్రపంచం మొత్తం ఏదో అవుతోంది. ముఖ్యంగా ఆసియాలో.. గత వారం రోజులుగా ఏదో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ మీద 6.9గా నమోదు అయింది. 

New Update
Earth Quake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

ఈ రోజు తెల్లవారు ఝామున పపువా న్యూగియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై 6.9 గా నమోదయింది. వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.  దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  పపువా న్యూ గినియాలో ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా ఉందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

వరుస భూకంపాలు..

నిన్న రాత్రి నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నమోదైంది. గర్ఖాకోట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంప ప్రభావం ఉత్తర భారత్‌ను కూడా తాకింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అనేదానిపై క్లారిటీ లేదు.

ఇటీవల మయన్మార్‌లో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావానికి మయన్మార్‌తో పాటు, థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ భూ ప్రళయానికి ఇప్పటిదాకా 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. 341 మంది  ఆచూకీ ఇంకా తెలియలేదు.

 today-latest-news-in-telugu | earth-quake

Also Read: USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

Advertisment
Advertisment
తాజా కథనాలు