JD Vance: అమెరికా ప్రజలకు బిగ్ రిలీఫ్‌...వేటినీ క్లోజ్ చేయడం లేదన్న వాన్స్

షట్ డౌన్ తర్వాత ప్రముఖ ప్రభుత్వ సేవలననీ ఆగిపోతాయన్న వార్తలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెక్ పెట్టారు. తాము వేటినీ మూయడం లేదని చెప్పారు. అయితే కొంత ప్రతికూల ప్రభావం మాత్రం భరించాల్సి ఉంటుందని తెలిపారు. 

New Update
vance

కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత ఇలా జరిగింది. డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన రెండు బిల్లులను రిపబ్లికన్లు ఆమోదించకపోవడం..అదే సమయంలో రిపబ్లికన్లు పెట్టిన వాటికి డెమోక్రాట్లు ఒప్పుకోకపోవడంతో క్లాష్ వచ్చింది. తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఇదంతా జరిగిందని తెలుస్తోంది. అమెరికా కాల మానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున 12.10 గంటలకు ప్రభుత్వం మూతబడింది. 

కొంత బాధ తప్పదు..

షట్ డౌన్ వల్ల అమెరికా ప్రభుత్వ సేవలకు అంతరాయం కలుగుతుందని అందరూ భావించారు. అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోతాయి. అమెరికా (USA)లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 7,50,000 మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయవద్దంటారని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై తాజాగా యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తాము ఏ సేవలూ క్లోజ్ చేయడం లేదని...ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలనుకోవడం లేదని అనౌన్స్ చేశారు. అయితే షట్ డౌన్ వలన దేశంలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని...దానికి మాత్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. డెమోక్రాట్లు ప్రభుత్వాన్ని రన్ చేయడానికి సహకరించకపోవడం వలన కొంత బాధ తప్పదని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో వారు మనసు మార్చుకుంటారని...దాని కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. షట్ డౌన్ అమలులో ఉన్నా ప్రభుత్వ సేవలకు ఆటంకం కలిగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించిన తర్వాత వాన్స్ ప్రకటన కాస్త ఊపిరి తీసుకునే వెసులుబాటు కల్పించింది. 

Also Read: Delhi Baba: ఛీ ఛీ..ఆశ్రమం నిండా అవే...పోలీసులకు ఊహించని వస్తువులు లభ్యం

Advertisment
తాజా కథనాలు