FIFA Peace Prize : డొనాల్డ్‌ ట్రంప్‌నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’..చెలరేగిన రాజకీయ దుమారం

అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య(FIFA) ఫిఫా సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించింది. అయితే దీనిపై రాజకీయ దుమారం రేగింది. వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో 2026 ఫిఫా ఫుట్‌బాల్‌ పోటీలో ఈ బహుమతి ప్రకటించింది.

New Update
FotoJet - 2025-12-06T070943.458

Donald Trump's first 'FIFA Peace Prize'

FIFA Peace Prize: అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య(FIFA) ఫిఫా సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించింది. అయితే దీనిపై రాజకీయ దుమారం రేగింది. వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో2026 ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలకు సంబంధించి  డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రంప్‌ హజరై ప్రపంచకప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పేర్కొన్నారు. దీంతో ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ  దుమారం చెలరేగింది

 శాంతి బహుమతి ఎవరికిస్తారంటే..

ప్రపంచ ఫుట్‌బాల్‌ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్‌ 5న ప్రకటించింది. ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఏకం చేయడానికి ఈ బహుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా ఆ సంస్థ వర్ణించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, శాంతి చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచడం కాదని, 500 కోట్ల మంది ఫుట్‌బాల్‌ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించడం విశేషం.

తొలి బహుమతి ట్రంప్ నకే...

కాగా ఫిఫా ప్రపంచకప్‌ 2026 డ్రా కార్యక్రమంలో ‘ఫిఫా శాంతి బహుమతి’ని ట్రంప్‌నకు గియానీ ప్రకటించారు. అనంరతం బంగారు పతకాన్ని ట్రంప్‌ అందుకున్నారు. దీంతో తొలి శాంతి బహుమతి  అందుకున్న వ్యక్తిగా ట్రంప్ నిలిచాడు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్‌ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. 

బహుమతి అందుకున్న సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు పొందడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటి. అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారన్నారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారన్నారు. ప్రపంచ వ్యా్ప్తంగా ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టానన్నారు.  ఇది ఎంతో గర్వకారణం. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను అని  చెప్పుకున్నాడు.  నా చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి’’ అని ట్రంప్‌ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. 

కాగా, ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ,  ఆయన ఆశలను వమ్ము చేస్తూ నార్వే నోబెల్‌ కమిటీ వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు ప్రకటించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైన విషయం తెలిసిందే. కాగా, ట్రంప్‌నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్‌ రైట్‌ వాట్‌ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శల వర్షం గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్‌లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది.  

జూన్‌ 11 నుంచి సాకార్‌ పోటీలు..

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన సాకర్‌ ప్రపంచక కప్‌  పోటీలు 2026 జూన్‌ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికాలు ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. జులై 19న న్యూ జెర్సీలో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఫిఫా చరిత్రలోనే తొలిసారి 48 జట్లు గ్రూప్‌ స్టేజీలో తలపడనున్నాయి. మొత్తం 12 గ్రూపులుగా విభజించగా, ఒక్కో గ్రూపులో నాలుగేసి దేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే 42 జట్లు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లకు అర్హత సాధించగా, 22 జట్లు మిగతా ఆరు స్థానాల కోసం బరిలో ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు