Donald Trump: సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై ట్రంప్ టారిఫ్స్.. ఈ సెక్టార్‌కు ఇక గడ్డు కాలమే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు పేల్చబోతున్నాడు. ఇప్పటికీ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించగా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు పేల్చబోతున్నాడు. ఇప్పటికీ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించగా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియన్‌ సాఫ్ట్‌వేర్‌ సెక్టార్‌ ఆందోళనలో పడింది. అవుట్‌సోర్సింగ్, విదేశీ రిమోట్ వర్కర్లపై టారిఫ్‌లు విధించాలని భావిస్తున్నారు. దీనివల్ల భారతీయ ఐటీ కంపెనీలు ఆర్థిక భారం పెరగనుంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై టారిఫ్‌లు విధిస్తే, భారతీయ కంపెనీలకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ద్వంద్వ పన్నులు (డ్యుయల్ ట్యాక్సేషన్) చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇది భారతీయ ఐటీ పరిశ్రమ లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

ఇది కూడా చూడండి: BREAKING: పార్టీలో గొడవలు.. పదవికి రాజీనామా చేసిన ప్రధాని!

భారత్ ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్..

భారతదేశ ఐటీ పరిశ్రమ విలువ దాదాపుగా 300 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇందులో సుమారు 60 శాతం ఎగుమతులు అమెరికాకే జరుగుతున్నాయి. అమెరికాకు జరిగే ఈ భారీ ఎగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన వనరు. ఒకవేళ టారిఫ్‌లు అమల్లోకి వస్తే భారతీయ ఐటీ కంపెనీల సేవలు అమెరికాలో ఖరీదుగా మారతాయి. దీనివల్ల అమెరికా కంపెనీలు భారతీయ సంస్థల నుండి సేవలు పొందడాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా భారత దేశంపై 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై కూడా టారిఫ్‌లు విధిస్తే, అది భారత ఐటీ రంగానికి కోలుకోలేని దెబ్బ తీస్తుంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, కంపెనీల ఆదాయాలు పడిపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Anuparna Roy : వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో అనుపర్ణ రాయ్‌ సరికొత్త రికార్డ్

Advertisment
తాజా కథనాలు