Donald Trump :
అమెరికా (America) లో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇరు పార్టీ నేతల మధ్య డిబేట్‌లు జరుగుతాయి. వీటిల్లో దాదాపు ఎవరు గెలుస్తారన్నది ఖాయం అయిపోతుంది. డిబేట్‌లో గెలిచిన వారికి ఎక్కువ ఓట్లు పడతాయి. ఇవి ఫెయిల్ అయిన దాకలాలు చాలా అరుదనే చెప్పాలి. ప్రస్తుత ఎన్నికల సమయంలో కడా ఈ డిబేట్లు చాలా ముఖ్యపాత్రనే పోషిస్తున్నాయి. క్రితం సారి ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన డిబేట్ ఏకంగా అభర్థినే మార్చేశాయి. డెమోక్రటిక్ పార్టీలో పెద్ద మార్పులే జరిగాయి. బైడెన్ స్థానంలో కమలా హారిస్ (Kamala Harris) వచ్చారు. తాజాగా కమలా హారిస్, ట్రంప్ ల మధ్య కూడా ఒక డిబేట్ జరిగింది. ఇందులో ట్రంప్ దై పై చేయి అయింది. పోల్స్ కూడా విజయం ఆయనదే అన్నట్టు చూపిస్తున్నాయి.
Also Read : మగపిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. చచ్చుబడిపోతున్న శరీరాలు
మామూలుగా అయితే అధ్యక్ష ఎన్నికల కంటే ముందు చాలాసార్లే డిబేట్ జరుగుతుంది. కనీసం మూడు సార్లు అయినా ఇద్దరు అభ్యర్థుల మధ్యా డిబేట్ జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం ట్రంప్ డిబేట్‌లలో ఇంక పాల్గొనను అని చెబుతున్నారు. మొన్న మంగళవారం కమలా హారిస్‌తో జరిగిన డిబేట్‌లో ఆమె ఓడిపోయినట్టు స్పష్టం అయిందని...ఇంక మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదని ట్రంప్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మరోవైపు కమలా హారిస్ మాత్రం మరోసారి చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో తాను ఇంక డిబేట్‌లలో పాల్గొనను అని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే రెండుసార్లు డెమోక్రటిక్ అభ్యర్థుల ఈద నేను గెలిచాను. ఇంక మూడోది అవసర లేదని ఆయన వాదిస్తున్నారు.
అయితే అమెరికాలో ప్రధాన మీడియా కథనం వేరేలా ఉంది. మంగళవారం ట్రంప్, కమలా హారిస్ మధ్య జరిగిన డిబేట్‌లో కమలాదే విజయం అని అంటున్నాయి. CNN పోల్‌లో 63% మంది డిబేట్ వీక్షకులు హారిస్ గెలుపొందారని చెబితే.. 37% మంది ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా YouGov పోల్‌లో 43% మంది ప్రతివాదులు హారిస్ ట్రంప్‌ను అధిగమించారని భావించారు. 28% మంది మాజీ అధ్యక్షుడికి అనుకూలంగా ఉంటే 30% మంది తటస్థంగా ఉండిపోయారు.
Also Read : రష్యా యుద్ధం నుంచి 45 భారతీయ సైనికులకు విముక్తి