అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్ట్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇటీవల నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా హిందూ అమెరికన్, మాజీ డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ, అమెరికా సైన్యంలో విధులు నిర్వర్తించిన తులసి గబార్డ్‌ను డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఇప్పుడు మరో వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే?
కొత్తగా ఏర్పాటు కాబోయే తన ప్రభుత్వంలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను ఆరోగ్య మంత్రిగా నామినేట్ చేశారు. ఆరోగ్య, మానవ సేవల మంత్రిత్వ శాఖ హెడ్‌గా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పేరును ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. దీర్ఘకాలంతో బాధపడుతున్న వ్యాధుల వ్యాప్తిని అరికట్టి దేశాన్ని ఆరోగ్య దేశంగా మారుస్తారనే నమ్మకంతో ఉన్నానని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఈ నామినేషన్‌ను యూఎస్ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం
ఇంతకీ ఎవరీ కెన్నడీ..
అమెరికాలోని మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ కుమారుడు ఈ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్. గతంలో కెన్నడీ జూనియర్ వ్యాక్సిన్లు వద్దని వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు. వ్యాక్సి్న్లు ఆరోగ్యానికి మంచివి కావని, ఇవి భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడీ నమ్ముతారు. ఈ టీకాలకు వ్యతిరేకంగా ఒక స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు.
ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం
అయితే చిన్న పిల్లలకు టీకాలు మంచివి కావని కెనెడీ వ్యతిరేకించారు. ఇలాంటి వ్యక్తికి ఆరోగ్య మంత్రిగా పదవి ఇవ్వడంతో పలువురు విమర్శిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని అతని చేతిలో బలి ఇస్తున్నారని అంటున్నారు. ఈ ఆరోగ్య పదవికి కెనడీ పూర్తిగా అనర్హుడని పలువురు విమర్శిస్తున్నారు.
ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్