America: అమెరికా ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ..జనవరి 20 న అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరం సన్నాహాలు చేస్తున్న ట్రంప్.. తన క్యాబినెట్, యంత్రాంగాన్నిరెడీ చేస్తున్నారు. ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిలకు ఇందులో ముందుగానే చోటు దక్కిన విషయంతెలిసిందే.
Also Read: AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను నియమించారు. తాజాగా, వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన జై భట్టాచార్యను నియమిస్తున్నట్టు ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జై భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబర్డ్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో ఎన్‌ఐహెచ్‌ను నడిపించడంతో పాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు భట్టాచార్య పనిచేస్తారని వివరించారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కలిసి కృషి చేస్తారు’ అని ట్రంప్ ఆ ప్రకటనలో తెలియజేశారు.
Also Read: TG: మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్
అటు, ట్రంప్ ప్రకటనపై జై భట్టాచార్య ఆనందం వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు ట్రంప్ నన్ను తదుపరి ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించారు. మేము అమెరికా శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యవంతమైన దేశంగా మారుస్తాం’ అని ఆయన వివరించారు. ఇక, పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన జై భట్టాచార్య.. 1968లో కోల్‌కతాలో పుట్టారు. ఎంబీబీఎస్ అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. 1997లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్, ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసి అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, నేషనల్ బ్యూరో ఎకనమిక్ రిసెర్చ్‌లో రిసెర్చ్ అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: Cinema: 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు..వధువు ఎవరో తెలుసా?
ఇటీవల ప్రపంచాన్ని పట్టిపీడించిన కోవిడ్-19 మహమ్మారిపై చేసిన ఆయన పరిశోధన కీలకమైంది. అంతేకాదు, కరోనా నియంత్రణలో నాటి ట్రంప్ ప్రభుత్వాన్ని విమర్శించినవారిలో భట్టాచార్య ముఖ్యపాత్ర పోషించారు. తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న వృద్ధులపై ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టి.. మరోవైపు, లాక్‌డౌన్‌లను ఎత్తివేయాలని నిపుణులతో కలిసి బహిరంగ లేఖ లు కూడా రాసిన సంగతి తెలిసిందే.