Trump: ట్రాన్స్‌జండర్లంటే ట్రంప్‌కు ఎందుకంత కోపం.. ఇదే కారణమా!

అమెరికాలో ట్రాన్స్ జెండర్లపై ట్రంప్ గవర్నమెంట్‌ ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ఫస్ట్ టైం గెలిచినప్పుడు వారిపట్ల వ్యతిరేక పోకడలే అవలంభించిన ట్రంప్ ఇప్పుడు మరింత కఠినంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. 

New Update
trump transgender

Trump vs Transgender

America: అమెరికాలో ట్రాన్స్ జెండర్లపై ట్రంప్ గవర్నమెంట్‌ ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఇకపై ఆడ, మగ మాత్రమే ఉంటారు. స్త్రీల ఆటలు మగవాళ్లు ఆడకూడదు. నా సంతకంతో ఏదోరోజు లింగమార్పిడి పిచ్చిని ఆపేస్తా అంటూ ఫీనిక్స్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అయితే లింగమార్పిడి చేసుకున్నవాళ్లంటే ట్రంప్‌కు ఎందుకంత కోపం? అసలు అమెరికాలో ట్రాన్స్‌జండర్ల జనాభా ఎంత? ట్రంప్ టర్మ్ నెక్ట్స్ నాలుగేళ్లు వాళ్ల పరిస్థితి ఏంటి? 2024 సంవత్సరంలో అమెరికా జనాభా 34కోట్లు. వాళ్లలో ట్రాన్స్‌జండర్లు ఎంతమంది? ఈఏడాది అధ్యక్ష ఎన్నికల్లో అక్కడ ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఫస్ట్ టైం యూఎస్ చట్టసభ సెనైట్‌లో ఓ ట్రాన్స్ జండర్ అడుగుపెట్టింది. ఈ క్రమంలో లింగమార్పిడి చేసుకున్నవాళ్లపై ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఎందుకో తెలుసుకుందాం. 

అప్పుడు కూడా వ్యతిరేక పోకడలే..

2017లో ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ట్రాన్స్‌జండర్లపై వ్యతిరేక పోకడలే అవలంభించాడు. ఇకపై వచ్చే నాలుగేళ్లు లింగమార్పిడి చేసుకున్నవాళ్లను ఆదేశంలో శత్రువులుగా చూస్తారు. తాజాగా ఫీనిక్స్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో ట్రాన్స్‌జండర్లను ఆర్మీలోకి తీసుకోము, స్కూల్లోకి రానివ్వమని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ట్రంప్ హామీ ఇచ్చారు. అలాగే ఇకపై ఎవరూ లింగమార్పిడి చేసుకోకుండా చట్టాలు తీసుకొస్తామని అన్నారు. వైట్‌హౌస్‌‌లో ఆయన  ప్రమాణస్వీకారం చేయగానే చేసే మొదటి పని అదేనట. LGBTQ హక్కులకు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే అక్కడ ట్రాన్స్‌జండర్ల జనాభా అంతకంతా పెరుగుతూ పోతుంది. దీన్ని కట్టడి చేయాలని ప్రజెంట్ గవర్నమెంట్ ట్రంప్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

భారీగా పెరిగిన లింగమార్పిడి సంఖ్య..

ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం.. అమెరికాలో 30ఏళ్ల కంటే తక్కువకున్న వాళ్లలో 5 శాతం కంటే ఎక్కువే ట్రాన్స్‌జండర్లు ఉన్నారంట. వాళ్లని వాళ్లు లింగమార్పిడి లేదా నాన్-బైనరీ చెప్పుకుంటున్నారు. గత రెండేళ్లుగా యునైటెడ్ స్టేట్స్‌లో లింగమార్పిడి చేసుకునే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ.. కరెక్ట్ డేటా ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేకపోతున్నారు. UCLA లా స్కూల్‌లోని విలియమ్స్ ఇన్‌స్టిట్యూట్ కూడా దీనిపై పరిశోధన చేసింది. 

అమెరికాలో 13ఏళ్లు పైబడిన 16 లక్షల మందికంటే ఎక్కువే ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ఆ రీసెర్చ్‌లో తేలింది. పుట్టుకతో వారికున్న లింగంతో సంతోషంగా లేక చాలామంది ట్రాన్స్‌జెండర్లుగా మారుతున్నారు. 2015లో US ఫొడరల్ కోర్ట్ అమెరికావ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల వివాహాన్ని చట్టబద్ధం చేసింది. అంతేకాదు.. వాళ్లు పిల్లలను దత్తత తీసుకునేందకు కూడా ఆమోదం తెలిపింది. అమెరికాలోని ట్రాన్స్‌జెండర్లు కూడా సైన్యంలో చేరవచ్చని ఒబామా ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత అమెరికా ఆర్మీలో ట్రాన్స్‌జండర్లు ఎక్కువైయ్యారు. సైన్యంలో ట్రాన్స్‌జండర్లు ఉంటే వాళ్లు మెడికల్‌ అలవెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయని, అంతేకాదు సైన్యంలో సమతుల్యత దెబ్బతింటున్నట్లు ట్రంప్ వివరించారు. 2017లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని నిషేధించారు. 

ఇది కూడా చదవండి: Hydra: హైడ్రాకు 5,800 ఫిర్యాదులు.. 200 ఎకరాల ప్రభుత్వ భూమి!

జో బిడెన్ అధికారంలోకి వచ్చాక.. LGBTQలు ఆర్మీలో చేరవచ్చని మళ్లీ చట్టం తీసుకోచ్చారు. డెమోక్రటిక్ పార్టీ వాళ్లకు సపోర్టీవ్‌గా ఉంటుంది. 2023 అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జండర్ అయిన సారా మెక్ బ్రైడ్ గెలిచింది. అమెరికా చరిత్రలోనే ఓ LGBTQ సెనైట్‌కు ప్రాతినిధ్యం వహించడం ఇదే ఫస్ట్ టైం. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక మాట్లాడుతూ.. LGBTQల సంఖ్య మన దేశాన్ని నాశనం చేస్తోందని అన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో లింగ-ధృవీకరణ సంరక్షణ అనేది అవసరమని గట్టిగా  చెప్పారు. ట్రాన్స్‌జండర్ల జనాభా పెరిగిపోవడం అమెరికా అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆయన అంటున్నారు.  పెరుగుతున్న లింగమార్పిడులను ఆపాలని ప్రజలను ట్రంప్ కోరారు. క్లిష్టమైన జాతి సిద్ధాంతం విధ్వంసక విధానమని చెప్పారు. 

ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 532 LGBTQ వ్యతిరేక బిల్లులు ఆమోదించబడ్డాయని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌ విడుదల చేసి ది కన్వర్సేషన్ నివేదిక పేర్కొంది.  2025లో కూడా ట్రాన్స్‌జెండర్ల హక్కుల ఉల్లంఘనలు జరుగుతాయని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అంచానా వేసింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినా వెంటనే అమలు కావు. అమెరికాలో ప్రతిపాధించిన చట్టాలు పబ్లిక్ కామెంట్ పీరియడ్‌లో పెడతారు. అంటే 2,3 నెలలపాటు వాటిపై ప్రజలు, సంస్థల అభిప్రాయాలు తీసుకుంటారు. తర్వాత సెనైట్‌‌లో ప్రవేశపెట్టి చట్టాలుగా మారుస్తారు. వాటిని వ్యతిరేకిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. అమెరికాలో ట్రంప్ తీసుకునే ట్రాన్స్‌జండర్లకు వ్యతిరేక నిర్ణయాలు అమలు అవుతాయో.. లేదో చూడాలి మరి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు