India-Canada: భారత్, కెనడాల స్నేహ హస్తం..కెనడాకు భారత హైకమిషనర్‌గా దినేశ్‌ కె.పట్నాయక్‌ నియమకం

కెనడా ప్రధానిగా ట్రూడో ఉన్న కాలంలో ఆ దేశం, భారత్ ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్ళీ రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ చిగురిస్తున్నాయి. దీంట్లో భాగంగా భారత్, కెనడాలు దౌత్య వేత్తలను పునర్నియమించాయి. 

New Update
ind-canada

India-Canada

మూడు నెలల క్రితం జూన్ లో భారత ప్రధాని కెనడా వెళ్ళారు. అప్పుడు ఆ దేశ కొత్త ప్రధాని మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. అప్పుడు ఇరుదేశాధినేతల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు  పునరుద్ధరించుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. పరస్పర గౌరవం, చట్టాలకు కట్టుబడి ఉండటం సహా ఇరు దేశాల్లోని పౌరులు, వ్యాపారులకు సాధారణ సేవలు తిరిగి అందించేందుకు అంగీకరించారు. దాంతో పాటూ భారత్, కెనడాల్లో దౌత్యవేత్తల పునర్నియామకానికి ప్రధాని మోదీ, కార్నీలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. రెండు దేశాలూ దౌత్య వేత్తలను నియమించారు. కెనడాకు భారత హైకమిషనర్‌గా దినేశ్‌ కె.పట్నాయక్‌ నియమించారు. ఆ దేశం సైతం భారత్‌లో తన హైకమిషనర్‌గా క్రిస్టోఫర్‌ కూటర్‌ను ప్రకటించింది. భారత హైకమిషనర్ దినేశ్ కె. పట్నాయక్ 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన స్పెయిన్ లో భారత రాయబారిగా పని చేస్తున్నారు. త్వరలో ఆయన అక్కడ నుంచి కెనడా వెళ్ళి బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ఖలీస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణంగా..

గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య  అనంతరం భారత్‌తో కెనడా సంబంధాలు  మరింత దిగజారాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రతిగా సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో దౌత్యపరమైన ప్రతిష్టంభన పెరిగింది. ఇప్పుడు తిరిగి సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించాయి.తాజాగా కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్‌ నియామకంపై కుదిరిన ఏకాభిప్రాయం కుదిరింది. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం  తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఇంధన భద్రత,  ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా  కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు. నిజానికి భారతదేశానికి జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు  కెనడా ఆహ్వనం మేరకు హాజరయ్యింది. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య  అనంతరం భారత్‌తో కెనడా సంబంధాలు  మరింత దిగజారాయి.

Also Read: PM Modi: అత్యంత ముఖ్యమైన జపాన్, చైనాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు