/rtv/media/media_files/2025/11/01/halloween-weekend-2025-11-01-08-00-30.jpg)
Halloween Weekend
Halloween weekend : అమెరికాలో ఏటా నిర్వహించే హాలోవీన్ వీకెండ్ సందర్భంగా మిషిగన్‌లో హింసాత్మక దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆరోపించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించి పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్, భారత సంతతి నేత కాశ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మరోవైపు ఈ కుట్ర కోణాన్ని చేధించిన ఎఫ్‌బీఐ సిబ్బందిని ఆయన అభినందించారు. పూర్తి అప్రమత్తతతో స్పందించడంతో పాటు దేశ రక్షణలో నిమగ్నమయ్యారని ప్రశంసించారు. మరోవైపు నగరంలో ఎఫ్‌బీఐ ఆపరేషన్ కొనసాగుతుందని మిషిగన్‌లోని డియర్‌బోర్న్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతానికి నగర ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని వారు తేల్చి చెప్పారు.
ఏటా అక్టోబర్ 31న హాలోవీన్ వీకెండ్ వేడుకలను అమెరికా పాటు అనేక దేశాల్లో ఘనంగా చేసుకుంటారు. ఈ వేడుకల్లో గుమ్మడి కాయలను రకరకాల ఆకృతుల్లో అలంకరించి, స్నేహితులు, బంధువులంతా విందూ వినోదాలతో ఆనందంగా గడపడం ఈ వేడుకల ప్రత్యేకం. దెయ్యాలు, రాక్షసుల దుస్తులు ధరించి ఇతరులను భయపెట్టం వంటివి ఇందులో ఉంటాయి. కాస్ట్యూమ్స్, డెకరేషన్స్, క్యాండీల కోసం అమెరికన్లు ఈసారి 13 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, వివిధ దేశాలపై ట్రంప్ విధించిన భారీ సుంకాలతో వీటి ధరలు భారీగా పెరిగాయి. అయినా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్... తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కుట్ర కోణం
Follow Us