నేపాల్‌లో 80వేల మంది డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 9వేల మంది చనిపోయారు కూడా.. నేపాల్‌తోపాటు భారత్, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలకు కూడా ఆ ముప్పు పొంచిఉంది. ఈ ప్రమాదం ఏంటో కాదు.. చైనా నిర్మిస్తున్న భారీ నీటి ప్రాజెక్టులు. జనవరి 7న ఉదయం 9గంటలకు నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 126 మంది ప్రాణాలను బలితీసుకుంది. టింగ్రీలోని 10 కిమీ లోతులో ప్రకంపనలు మొదలైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది.
టింగ్రి ఎవరెస్ట్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే ప్రాంతంలో 1950 నుంచి ఇప్పటివరకు 6 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో 21 భూకంపాలు సంభవించాయి. వీటిలో అతిపెద్దది 2017లో మెయిన్‌లింగ్ ఎర్త్‌కేక్. 6.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నేపాల్‌లో వినాశనాన్ని సృష్టించింది. 2015లో నేపాల్ రాజధాని ఖాట్మండులో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. అంతేకాదు వేలాది మంది గాయపడ్డారు. వీటన్నీంటికి కారణం చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న డ్యామ్‌లే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే టిబెట్, నేపాల్ సరిహద్దులో చైనా అనేక రిజర్వాయర్లు నిర్మించింది. వీటి కారణంగానే ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని కొన్ని దేశాలు వాదిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాన్ని బ్రహ్మపుత్రనదిపై చైనా కట్టబోతుంది. చైనా డ్యాంలు భూకంపాలను ఎలా ప్రభావితంగా చేస్తున్నాయి.. ఎర్త్‌కేక్స్‌కు డ్యాంలకు ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
రిజార్వాయర్లు భూకంపాలకు కారణమిలా..
చైనా, నేపాల్‌తోపాటు ఉత్తర భారతదేశంలోని నైరుతి ప్రాంతాలు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్‌లో తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు భూకంపాలకు కారణమైతాయి. ఇలా వచ్చే భూప్రకంపనలను రిజర్వాయర్-ప్రేరిత భూకంపం (RIS) అంటారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల సైజ్, చుట్టు పక్కల భౌగోళిక పరిస్థితులు ప్రాంతాలు, క్రియాశీల లోపాలపై ఆధారపడి భూకంపాలు వస్తాయి. జలాశయం నిండినప్పుడు, నీటి బరువు భూమి క్రస్ట్(కేంద్రం)పై ఒత్తిడిని పెంచుతుంది. ఈ అదనపు పీడనం చుట్టుపక్కల భూమిలో లోపాలపై పనిచేస్తుంది. వాటిని అస్థిరపరిచే ప్రమాదమూ ఉంది. నేల లోపలికి నీరు చొచ్చుకుపోయి.. మట్టిని ద్రవపదార్థంగా మార్చుతోంది. అప్పుడు రిజర్వాయర్ కింద భూభాగం సర్ధుబాటు చేసుకుంటోంది. ఈ అడ్జెస్‌మెంట్ భూమి జారడానికి, భూప్రకంపనలు ఉత్పత్తి చేసే ప్రమాదం ఉంటుంది. పెరిగిన వాటర్ బరువు భూమి క్రస్ట్‌లోని ఒత్తిడి పంపిణీని మార్చగలదు. ఇది గతంలో స్థిరంగా ఉన్న ప్రాంతాలలో భూకంపాలు వచ్చేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌ల చుట్టు సంభవించిన రిజర్వాయర్-ప్రేరిత భూకంపాలు చూస్తే..
ఇండియాలోని కోయ్నా డ్యాం కట్టిన తర్వాత 1967లో 6.3 తీవ్రతతో రిజర్వాయర్ చుట్టుపక్కలు ఎర్త్‌కేక్ సంభవించింది.
తజికిస్తాన్ లో నురేక్ రిజర్వాయర్ నిండిన కొద్దిసేపటికే 1976లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది.
జింబాబ్వే దేశంలోని జాంబియాలో కరీబా రిజర్వాయర్ నిండిన తర్వాత 1960లలో వరుసగా చిన్నచిన్న ఎర్త్‌కేక్స్ సంభవించాయి.
ఇంజనీర్లు పెద్ద ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఆ నేలను భూకంపాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయని పరీక్షిస్తారు. భవిష్యత్‌లో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ఇందుకోసం కొన్ని టెక్నిక్స్‌ను డ్యాం నిర్మాణంలో వాడతారు. అయితే ఇప్పుడు టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిని చైనా కట్టబోయే నదిపై కూడా ఆందోళనలు వస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ దేశంలో యార్లంగ్ త్సాంగ్‌పో అని పిలుస్తారు. మెన్లింగ్ టిబెట్ యార్లంగ్ జాంగ్బో నది దిగువ ప్రాంతంలో ఉంది. ఇక్కడ యార్లంగ్ త్సాంగ్‌పో నదిపై చైనా భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేసింది. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ అవుతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై భారత్ ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ భౌగోళికంగా, నీటి వనరులపై ఎలాంటి ప్రభావం ఉండదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియా సమావేశంలో తెలిపారు. దిగువ దేశాలలో ప్రతికూల ప్రభావం ఉండదని జియాకున్ చెప్పారు. చైనా బ్రహ్మపుత్ర నదిపై కట్టబోయే ప్రాజెక్ట్ విషయంలో పారదర్శకతంగా ఉండాలిని ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ కోరింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో దిగువ దేశాలతో సంప్రదింపులు అవసరమని భారతీయ విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ చెప్పారు. చైనా కార్యకలాపాల వల్ల బ్రహ్మపుత్ర దిగువ దేశాల ప్రయోజనాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనా దేశాన్ని ఆయన కోరారు. నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా చైనా ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చైనా చర్యల వల్ల నేపాల్‌కు జరిగింది తలుచుకుంటే.. భవిష్యత్‌లో భారత్‌కు ఏం జరగబోతుందో ఆలోచిస్తే ఆందోళనకరంగా ఉంది.