తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా చైనా.. ప్రజలకు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇటీవల ఓ కంపెనీ డేటింగ్‌కి వెళ్తే డబ్బులిస్తామనే సరికొత్త ప్రకటన చేసింది. కంపెనీలో వర్క్ చేస్తున్న సింగిల్స్ అందరూ కూడా డేటింగ్ చేసేలా డిఫరెంట్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో వారు డేటింగ్‌కి వెళ్తే.. డబ్బును బహుమతిగా ఇస్తామని ఓ టెక్ కంపెనీ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్!
జనాభాను పెంచేందుకు డేటింగ్ కాంటాస్ట్..
ఈ డేటింగ్ కాంటాస్ట్‌లో కంపెనీలో వర్క్ చేసే సింగిల్స్ అందరూ ఇతరులు ఆకర్షితులు అయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాలి. ఇలా పోస్ట్‌లు చేయడం వల్ల వారికి 66 యువాన్లు అనగా భారత కరెన్సీలో రూ.770 ఇస్తారు. పోస్ట్ చేసిన తర్వాత మూడు నెలల పాటు ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తే ఒక్కోరికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!
ప్రపంచంలో చైనాలోనే ఎక్కువ జనాభా ఉండేవారు. కానీ ఇప్పుడు యువత పెళ్లికి నిరాకరించడంతో రోజురోజుకీ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో యువతను ఆకర్షించడానికి కొత్త కొత్త స్కీమ్‌లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ కంపెనీలు సింగిల్‌గా ఉన్న వారికి ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తుంది.
ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా
ఈ ఆఫర్లకు యువత అట్రాక్ట్ అయి డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా రావచ్చు. దీనివల్ల చైనాలో జనాభా పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా పలు కంపెనీలు కూడా యువతను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది.
ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!