ప్రపంచాన్ని ఆగం చేస్తున్న ట్రంప్.. H-1B గందరగోళం.. ఎయిర్ పోర్టులో టికెట్ రేట్లు ట్రిపుల్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచమంతా అల్లాడిపోతుంది. H 1B వీసాలపై లక్ష డాలర్లు ఫీజుతోపాటుగా అమెరికాలో ఎంట్రీకి సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి వరకు మాత్రమే గడువు ఉండటంతో టెక్ కంపెనీలు మొత్తం షాకయ్యాయి.

New Update
donald Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచమంతా అల్లాడిపోతుంది. H 1B వీసాలపై లక్ష డాలర్లు ఫీజుతోపాటుగా అమెరికాలో ఎంట్రీకి సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి వరకు మాత్రమే గడువు ఉండటంతో టెక్ కంపెనీలు మొత్తం షాకయ్యాయి. హాలీడేస్,  బిజినెస్ ఇలా వివిధ పనుల మీద అమెరికా బయట ఉన్న H 1B వీసాదారులు గందరగోళంలో పడ్డారు. సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి లోపు అమెరికా తిరిగి వచ్చేయలంటూ మెక్రోసాఫ్ట్ తో పాటు పెద్ద కంపెనీల ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న H 1B వీసాదారులు ఎయిర్ పోర్టులకు క్యూ కడుతున్నారు. ఇక జర్నీలో ఉన్న వాళ్లు.. జర్నీ మధ్యలో ఉన్న వాళ్లు.. ఇండియాకు వెళ్దామని ఎయిర్ పోర్టులో ఉన్న వాళ్లు.. అప్పటికప్పుడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ల పరిస్థితి మరింత గదరగోళంగా ఉంది. ఒక్క సంతకంతో ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడన్నమాట.  

సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రిలోపు అమెరికా వచ్చేయండని దిగ్గజ కంపెనీలు  H1B వీసాదారులుకు ఆదేశాలు జారీ చేయడంతో   విమానయాన సంస్థలు దీన్నిక్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ రేట్లను దారుణంగా పెంచేశాయి. దాదాపుగా లక్ష రూపాయల వరకు ఫ్లయిట్ టికెట్స్ ఉన్నాయి. ఇక అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో గందరగోళం నెలకొంది. ట్రంప్ ప్రకటన తర్వాత విమానం ఎక్కాలా వద్దా.. ఇండియా వెళ్లాలా వద్దా అనే గందరగోళంలో ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానం 3 గంటలుగా నిలిచిపోయాయి. 

అమెరికాలో ఎంట్రీ అవ్వాలంటే

సెప్టెంబర్ 21వ తేదీ తర్వాత H1B వీసాదారులు అమెరికాలో ఎంట్రీ అవ్వాలంటే అక్షరాల లక్ష డాలర్లు.. మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 88 లక్షల రూపాయలు కట్టాలి. ఇది కంపెనీలకే భారం అయితే.. ఇక సొంతంగా కట్టుకోవాలంటే చాలా కష్టం.. ఈ క్రమంలోనే అమెరికా వెలుపల ఉన్న.. అంటే కంపెనీ సెలవుల్లో, వ్యక్తిగత పనుల్లో ఇతర దేశాల్లో ఉన్న H1B వీసా ఉద్యోగులు అందర్నీ వెంటనే అమెరికా రావాలంటూ ఆయా కంపెనీలు అల్టిమేటం ఇచ్చాయి. దీంతో అలాంటివాళ్లు అందరూ ఇప్పుడు హై టెన్షన్ పడుతున్నారు.

గతంలో H-1B వీసా దరఖాస్తుకు కేవలం $1,500 వరకు మాత్రమే ఫీజు ఉండేది. ఇప్పుడు ఇది ఏకంగా $100,000 కు పెరిగింది, ఇది ఇండియాలో  ₹88 లక్షలకు సమానం.  ఈ కొత్త ఫీజు ప్రధానంగా కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి,  అమెరికా వెలుపల ఉండి తిరిగి అమెరికాలోకి ప్రవేశించాలనుకునే వీసా హోల్డర్లకు వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉండవచ్చు. H-1B వీసా హోల్డర్లలో 70% కంటే ఎక్కువ మంది భారతీయులే. ఈ కారణంగా, ఈ కొత్త నిబంధన భారతీయ టెక్ నిపుణులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చిన్న ఐటీ కంపెనీలు ఈ ఖర్చును భరించలేక ఉద్యోగులను వెనక్కి పంపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Also Read : IND-W vs AUS-W: పింక్ జెర్సీలో టీం ఇండియా.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్ - అసలు కారణం ఇదే..!

Advertisment
తాజా కథనాలు