Bangladesh: రాజ్యాంగంలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు తొలగించండి...!

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్.. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రతిపాదించడం సంచలనంగా మారింది.

banglaw
New Update

బంగ్లాదేశ్:

రాజ్యాంగేతర మార్గాల ద్వారా పాలనలో మార్పునకు మరణశిక్షను సూచించే నిబంధనతో పాటు రాజ్యాంగం నుంచి ‘సెక్యులరిజం’, ‘సోషలిజం’ అనే పదాలను తొలగించాలని బంగ్లాదేశ్ ఉన్నతస్థాయి న్యాయ అధికారి అన్నారు. పౌరుల బృందం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం నాటి విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ మహ్మద్ అసదుజ్జామాన్.. రాజ్యాంగంలోని నాలుగు సూత్రాలలో రెండు ‘లౌకికవాదం’ ‘సామ్యవాదం’ అనే పదాలతో పాటు జాతిపితగా షేక్ ముజిబుర్ రెహమాన్‌ పేరును తొలగించాలని ఆయన విజ్ఙప్తి చేశారు.

Also Read: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!

‘షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్‌లో తిరుగులేని నాయకుడు.. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అవామీ లీగ్ ఆయన పేరును వాడుకుంటోంది’ అని అన్నారు.. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడైన ఆయన బంగాబంధు అని అన్నారు. దేశ బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ హయాంలో చేసిన 15వ రాజ్యాంగం సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు.. ఈ విషయంలో మధ్యంతర ప్రభుత్వం తన వైఖరితో ముందుకు రావాలని నోటీసులు జారీచేసింది.

Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

కోర్టు వెలుపల అటార్నీ జనరల్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ‘మొత్తంగా ఆ (హైకోర్టు) నిబంధనను రద్దు చేయాలని మేము కోరుకోవడం లేదు’ రిట్ పిటిషన్‌పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. కోర్టు విచారణ సమయంలో 15వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 7ఏను అటార్నీ జనరల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక, చాలా మంది మంది లాయర్లు.. ఈ రిట్ పిటిషన్‌లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే, కొందరు ఈ అభ్యర్ధనను సమర్థించగా.. కొందరు మాత్రం ఒప్పుకోలేదు.

Also Read: Facebook: ఫేస్‌ బుక్‌కు  భారీ షాక్‌!

రాజ్యాంగంలోని అనేక నిబంధనలు పునరుద్ధరణ, రద్దు, కొత్తవి నిబంధనలు చేర్చడానికి నాటి అవామీ లీగ్ ప్రభుత్వం 15వ సవరణను పూర్తి మెజార్టీతో పార్లమెంటు ఆమోదించింది. ఈ సవరణలలో లౌకికవాదాన్ని రాజ్య సూత్రంగా పునరుద్ధరణ, ఎన్నికల పర్యవేక్షణ కోసం ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను రద్దు, రాజ్యాంగేతర మార్గాల ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టడం, షేక్ ముజిబుర్ రెహమాన్‌ను జాతిపితగా పేర్కొనడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను పునరుద్ధరించాలని, రాజ్యాంగంలో ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!

 

#bangladesh attorney general #mohammad asaduzzaman #bangladesh constitution
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe