Social Media : 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. !

అస్ట్రేలియా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ భద్రతను నిర్ధారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది.

New Update
social media

అస్ట్రేలియా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ భద్రతను నిర్ధారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని  ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఈ నిబంధన 2025 డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు మైనర్లు Facebook, Instagram, TikTok, Snapchat, X , YouTube, Reddit, Kick వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం లేదా వాడటం అనేది చట్టవిరుద్ధం అవుతుంది.

పూర్తిగా బాధ్యత కంపెనీలదే

 ఆన్‌లైన్ ప్రమాదాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి  పిల్లలను రక్షించడానికి ఈ చట్టం రూపొందించబడిందని ప్రభుత్వం చెబుతోంది.మొదట్లో మినహాయింపు ఇవ్వాలని భావించినా, పరిశోధనల తర్వాత యూట్యూబ్‌ను కూడా ఈ నిషేధ జాబితాలో చేర్చారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా ఆయా సోషల్ మీడియా కంపెనీలదేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.

16 ఏళ్ల లోపు వారు తమ ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్‌లు క్రియేట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంది. ఒకవేళ రూల్స్ పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 410 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న అనేక దేశాలు (డెన్మార్క్, కొన్ని US రాష్ట్రాలు వంటివి) ఆస్ట్రేలియా చట్టాన్ని గమనిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆస్ట్రేలియా మోడల్‌కు మద్దతు ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు