లెబనాన్ రాజధాని బీరూట్ లో ఇజ్రాయెల్ మరో భారీ వైమానిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ అధినేత హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి పై ఐడీఎఫ్ ఇంతవరకు స్పందించలేదు.
Also Read: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం..చమురు మీద భారీ ప్రభావం
హషీమ్ ప్రస్తుతం హెజ్‌బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నాడు. హసన్ నస్రల్లాకు హషీమ్ దగ్గరి బంధువు. గత శుక్రవారం బీరూట్ లోని దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయం పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడడంతో హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే.
Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు!
ఈ ఘటనలో ఇరాన్ డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్, హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ అలీ కర్కి సహా మరికొంత మంది కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ రెండు రోజుల క్రితం సుమారు 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది.