War: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం..చమురు మీద భారీ ప్రభావం

మధ్య ప్రాచ్యంలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచం అంతటనీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే భయం ఒకటైతే..ఇరాన్ లోని చమురు బావులు నాశనం అయితే పరిస్థితి ఏంటా అనే భయం మరొకటి పట్టి పీడిస్తోంది. 

New Update
12

Iran-Isreal War: 

హెజ్బుల్లా అధిపతి నస్రల్లా చనిపోవడంతో ఇరాన్..ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఒకసారి 200 బాంబులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ మండిపోతోంది. దీనికి తప్పక ప్రతీకార తీర్చుకుంటటామని అంటోంది. దీని కోసం ప్లాన్లు కూడా వేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు సైనిక అధికారులతో సమావేశమై వ్యూహాలపై చర్చిస్తున్నారు.  ఇరాన్‌ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడుతామని హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తానని అంటోంది. అయితే అణుదాడికి దిగితే మాత్రం సమర్ధించమని అంటోంది. అలాగే ఇరాన్ అణు కేంద్రాల మీద కూడా దాడి చేయొద్దని ఇజ్రాయెల్ కు సూచిస్తోంది. 

అయితే ఇప్పుడు అన్నింటి కంటే ఎక్కువ భయపడుతున్న విషయం చమురు. ఇరాన్ చమురు బావుల గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ప్రపంచం మొత్తం ఇక్కడ నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. పర్షియన్‌ గల్ప్‌లోని ఇరాన్‌ తీరానికి 25 కి.మీ.దూరంలో ఉన్న ఖర్గ్‌ అనే చిన్నదీవి ఇరాన్‌కు ఆయువుపట్టు. ఇక్కడ నుంచే భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, అమెరికాకు కూడా ఇక్కడి నుంచే చమురు సరఫరా అవుతుంది. ఇదొక్కటే కాదు ఇరాన్‌లో ఉన్న మిగతా దీవుల నుంచి కూడా చమురు ఉత్పత్తి అవుతుంది. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న ఇతర దేశాలైన బహ్రయిన్‌, ఖతార్‌, కువైత్‌, ఇరాక్‌, సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్‌ ఈ తీరప్రాంతంలోనే ఉన్నాయి.  

ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేస్తే..ఇరాన్‌లోని ఖర్గ్ ను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచం మొత్తం మీద చమురు ఎఫెక్ట్ పడుతుంది.   దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా 5 శాతం చమురు ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థల అంచనా వేస్తున్నాయి. అది అక్కడితో ఆగిపోదు. భవిష్యత్తులో చమురు దిగుమతులు చాలా కష్టం అయిపోతాయి. చమురు దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోతాయి. అది ఎంతో ఇప్పుడు చెప్పడం కూడా కష్టం. అప్పుడు పెట్రోల్ రేట్లు సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు చమురు ధరల ప్రభావం అన్ని దేశాల స్టాక్ మార్కెట్ల మీ కూడా పడుతుంది. దీని వలన మార్కెట్లు క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధం భయం కారణంగా స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ అవుతున్నాయి. దీని వలన చాలా డబ్బులు నష్టం వస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు