షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

రిజర్వేషన్లపై అల్లర్లు చెలరేగడంతో దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశం అరెస్ట్ వారెంటీ జారీ చేశారు. భారత్‌లో తలదాచుకుంటున్న ఆమెను ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? లేదా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.

sheikh hasina and modi
New Update

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై దేశం విడిచి పారిపోయి రావడంతో ఇటీవల ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. రిజర్వేషన్లపై అల్లర్లు చెలరేగడంతో దేశం విడిచి ఆమె భారత్‌లో తలదాచుకుంది. దీంతో బంగ్లాదేశ్‌కి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌.. నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి, తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్‌ ప్రాసిక్యూటర్ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం ఆదేశించారు. 

ఇది కూడా చూడండి: రాధిక మర్చంట్ బర్త్‌డే వేడుకలు.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటోలు

అప్పగించాలని డిమాండ్..

ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న హసీనా ఆగస్టు 5న ప్రధాని పదవి నుంచి దిగిపోయింది. ఆ తర్వాత ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. హసీనాను బంగ్లాదేశ్‌కి రప్పించాలని ఆ దేశం ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. అప్పటికీ చట్టబద్ధంగా హసీనాను బంగ్లాదేశ్‌కి అప్పగించాలని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ కూడా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆమె పాస్‌పోర్టు కూడా రద్దయ్యింది. ఆమె ఇండియాలో తలదాచుకోవడం కూడా బంగ్లాదేశ్‌కి ఇష్టం లేదు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్!

హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడానికి అక్కడి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. అయితే హసీనాను అప్పగించాలా? వద్దా? అనే విషయం పూర్తిగా ఇండియా మీదే ఆధారపడి ఉంది. మరి ప్రధాని మోదీ హసీనాను బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే భారత్‌తో బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాలు కంటిన్యూ కావాలంటే హసీనాను తప్పకుండా బంగ్లాకు అప్పగిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది.

ఇది కూడా చూడండి:  Gold Prices: రూ. 79 వేలకు చేరిన బంగారం..కొనగలమా ఇక!

బంగ్లాదేశ్‌లో నిరసనల వెనుక పాకిస్తాన్, చైనా హస్తం ఉందనే ఆరోపణలు బాగా వినిపించాయి. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, అందుకే దేశంలో అల్లర్లు క్రియేట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ప్రధాని మోదీ హసీనాను బంగ్లాదేశ్‌కు పంపించే ప్రసక్తి లేదని తెలుస్తోంది. అయితే నవంబర్ 18లోగా ఆమెను బంగ్లాకు రప్పించాలని అరెస్ట్ వారెంటీ కూడా జారీ చేశారు. ఈ విషయంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చూడండి:  సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

 

#sheikh-hasina
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe