/rtv/media/media_files/2024/10/18/SUOB0RykJrqNnIh7tlP7.jpg)
Radhika Marchant Birthday Photos: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న వేడుక ఇంట్లో చేసిన కూడా సోషల్ మీడియాను హల్‌చల్ చేస్తోంది. ఇటీవల అంబానీ చిన్న కొడుకు అయిన అనంత్ (Anant Ambani), రాధికా మర్చంట్ వివాహం జరిగింది. అయితే పెళ్లయిన తర్వాత రాధికా మర్చంట్ తన మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.
ఇది కూడా చూడండి: సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో
30వ ఏటా పుట్టిన రోజు వేడుకలు
అంబానీ చిన్న కోడలు రాధికా 30వ పుట్టిన రోజు వేడుకలను అక్టోబర్ 16న ఘనంగా ముంబాయిలో జరిపారు. ఈ వేడుకలకు అంబానీ కుటుంబ సభ్యులతో పాటు రాధిక మర్చంట్ తల్లితండ్రులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా హాజరయ్యి.. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Mahi and sakshi spotted in Radhika Marchant's birthday bash!pic.twitter.com/aaeWQ89JDR
— Daddyscore (@daddyscore) October 17, 2024
ఇది కూడా చూడండి: Gold Prices: రూ. 79 వేలకు చేరిన బంగారం..కొనగలమా ఇక!
ఈ వీడియోలో రాధికా వైట్ అండ్ రెడ్ డ్రస్‌లో సింప్లీ సూపర్‌గా రెడీ అయ్యిది. సంతోషంగా కేక్ కట్ చేస్తూ.. అనంత్ అంబానీ, రాధిక తల్లి, తండ్రి, సిస్టర్, ముఖేశ్ అంబానీతో పాటు అతని తల్లి కోకిలాబెన్‌కి కూడా కేక్ తినిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్!
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులు, ఆర్యన్ ఖాన్, జాన్వీ కపూర్, సుహానా ఖాన్, రణవీర్ సింగ్, శిఖర్ పహారియా, అర్జున్ కపూర్, డైరెక్టర్ అట్లీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒరీ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌ఫ్లూయెన్సర్ ఒరీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం ఇవి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చూడండి: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా.. అయితే ఆరోగ్యంగా ప్రమాదంలో పడినట్లే!