/rtv/media/media_files/2025/11/24/fotojet-2025-11-24t114717153-2025-11-24-11-49-33.jpg)
DNA Paternity TestsDNA Paternity Tests
DNA Paternity Tests : ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న మన పిల్లలు మన వాళ్లు కారని తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ పిల్లలకు తను తండ్రి కాదని తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఏంటీ? అంతేకాదు పుట్టిన పిల్లల్లో ఎవరికీ తన పోలికలు కాకుండా ఇతరుల పోలికలు వస్తే ఆ ఇంటి యజమాని పరిస్థితి ఏంటీ? అ నిజాలన్నీ చూసి ఆ తండ్రి తట్టుకోగలడా? ఆఫ్రికాఖండంలోని ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. తమ పిల్లలు నిజంగా తమకే పుట్టారా? అనే అనుమానంతో చాలామంది ఉగాండా వాసులు ముఖ్యంగా పురుషులు పితృత్వ పరీక్షలకు క్యూ కడుతుండటంతో ఆందోళనకు గురి చేస్తోంది.
గడచిన కొద్ది కాలంగా దేశంలో డీఎన్‌ఏ పరీక్షలు విపరీతంగా పెరిగాయి. స్వచ్ఛంద DNA పరీక్షను కోరుకునే పురుషుల సంఖ్య ఇటీవల పెరిగిందని, తరచుగా "హృదయ విదారకమైన" ఫలితాలు వస్తున్నాయని తెలుస్తోంది.DNA పరీక్షల కోసం వచ్చే వారిలో దాదాపు 95% మంది పురుషులే, కానీ 98% కంటే ఎక్కువ మంది ఫలితాలు ఈ పురుషులు జీవసంబంధమైన తండ్రులు కాదని చూపిస్తున్నాయి" అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ ముండేయి ఇటీవల విలేకరులతో అన్నారు. ఈ చేదు వాస్తవం వారి కుటుంబాల్ని కకావికలం చేస్తోంది. కుటుంబాల్లో గొడవలు తీవ్రమవుతున్నాయి. పచ్చని కాపురాలు కుప్పకూలుతున్నాయి. దీంతో ‘మీ గుండె దృఢంగా ఉంటే తప్ప.. ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకండి’ అంటూ స్వయంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సూచనలిస్తున్నారంటేనే.. పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
వివాదం ఎలా మొదలైందంటే?
ఇటీవల ఉగాండాలో జరిగిన ఓ ప్రముఖ కేసులో కోర్టు డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించింది.ఈ కేసులో కంపాలాలోని ఒక సంపన్న విద్యావేత్త తన ముగ్గురు పిల్లల్లో ఒకరికి తండ్రి కాదని తేలింది. ఈ కేసును స్థానిక పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. ఈ విషయానికి ప్రాచుర్యం లభించడంతో చాలామందికి వారి సంతానం మీద అనుమానాలు మొదలయ్యాయి. ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం.. మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతే.. విడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం చేసేవారు. చాలా కేసుల్లో పురుషుల్లోసంతాన సమస్యలున్నప్పటికీ.. శిక్ష మాత్రం ఆడవారికి పడుతుండడంతో చాలామంది మహిళలు ఇతరులతో సంబంధాలు పెట్టుకుని పిల్లలను కంటున్నారని అధికారి ఒకరు తెలిపారు.
వెల్లువెత్తిన డీఎన్‌ఏ కేంద్రాలు
DNA పరీక్షలకు డిమాండ్ పెరగడంతో ఉగాండా అంతటా DNA పరీక్షా కేంద్రాలు వెలిశాయి, రేడియోలు, బహిరంగ ప్రదేశాలలో క్లినికల్ ల్యాబ్‌ల ద్వారా దూకుడుగా ప్రకటనలు వెలువడ్డాయి. ఉగాండా రాజధాని కంపాలాలో కొన్ని ప్రయాణీకుల టాక్సీలు DNA పరీక్షను అందించే సౌకర్యాలతో కూడిన ప్రకటనల సిక్కర్లు అంటించుకుని ప్రచారం చేస్తుండటంతో వాటికి డిమాండ్ పెరిగింది. అయితే కుటోయ్ మేయర్‌గా ఉన్న నబుమాలి అనే చిన్న పట్టణంలో, చాలా కుటుంబాలు DNA పరీక్ష రుసుములను భరించలేకపోతున్నాయి, సమీపంలోని Mbale నగరంలో DNA పరీక్ష చేయడానికి ఏర్పాటు చేసిన ఏకైక ప్రైవేట్ ప్రయోగశాలలో ఇది $200 కంటే ఎక్కువగా ఉంది.
మత గురువుల ప్రయత్నాలు వృథా..
గ్రామీణ ప్రాంతాల్లో డీఎన్‌ఏ పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేని ప్రజలు పెద్ద పెద్ద నాయకులు, మత గురువుల వద్దకు వెళ్లి సలహాలు అడుగుతున్నారు. అయితే చాలామంది పాస్టర్లు, తెగ పెద్దలు.. ఈ కుటుంబాలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. "ఈ బిడ్డ నాది కాదని నేను అనుమానిస్తున్నానని మీరు చెప్పకూడదు" అని, ‘పిల్లలు ఎలా పుట్టినా.. వారు ఈ ఇంటి వారే. వారిని తిరస్కరించడం పాపం. ఇదే సంప్రదాయం ఒకప్పుడు కుటుంబాలను నిలిపింది’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చిలు కూడా డీఎన్‌ఏ పరీక్షలపై మనసు పెట్టొద్దని సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలామంది వీటిని పట్టించుకోవడం లేదు.
పితృస్వామ్య వివాదాలు
కుటుంబ పితృస్వామి మరణించిన తర్వాత ఆస్తి పంపిణీ చుట్టూ పితృస్వామ్య వివాదాలు తిరుగుతున్నాయి, అంతేకాకుండా జీవిత భాగస్వామి మద్దతు వివాదాస్పదమైనప్పుడు విడాకుల విచారణల సమయంలో కూడా ఇవి తలెత్తుతున్నాయి.పరిణామాల గురించి ఆలోచించకుండా DNA పరీక్ష కోసం ప్రయత్నిస్తున్న పురుషులు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు.
Follow Us